https://oktelugu.com/

Priyanka Chopra On RRR: ఆర్ ఆర్ ఆర్ మూవీపై ప్రియాంక చోప్రా అనుచిత కామెంట్స్… నాకు అంత టైం లేదంటూ!

ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా లేరు. ఆమె హిందీ చిత్ర పరిశ్రమను వదిలేసి చాలా కాలం అవుతుంది. అందుకు కారణాలు కూడా ఆమె ఇటీవల వెల్లడించారు. బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువ.

Written By:
  • Shiva
  • , Updated On : May 17, 2023 / 08:02 AM IST

    Priyanka Chopra On RRR

    Follow us on

    Priyanka Chopra On RRR: ఆర్ ఆర్ ఆర్ మూవీ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టిన చిత్రమిది. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేస్తుంది. పలు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించబడింది. జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ వంటి దిగ్గజాలు మెచ్చుకున్నారు అలాంటి ఆర్ ఆర్ ఆర్ ని ప్రియాంక చోప్రా తక్కువ చేసి మాట్లాడారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసేంత తీరిక నాకు లేదన్నారు. అది పరోక్షంగా ఆర్ ఆర్ ఆర్ ని చిత్ర గౌరవాన్ని తగ్గించడమే అని అభిమానులు భావిస్తున్నారు.

    గతంలో కూడా ప్రియాంక చోప్రా ఆర్ ఆర్ ఆర్ బాలీవుడ్ మూవీ అన్నారు. తప్పును సరి చేసుకుంటూ కాదు ఇది తమిళ చిత్రం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న ఒక మూవీ ఏ పరిశ్రమకు చెందినదో కూడా ఆమెకు అవగాహన లేదు . తెలుగు సినిమా ఆస్కార్ వరకూ వెళ్లినా ఇండియాకు చెందిన ఇతర పరిశ్రమల వారు దాన్ని ఒప్పుకోలేకున్నారు. ప్రియాంక చోప్రా మాటలే అందుకు నిదర్శనం. ప్రియాంక చోప్రా కామెంట్స్ నేపథ్యంలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

    ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా లేరు. ఆమె హిందీ చిత్ర పరిశ్రమను వదిలేసి చాలా కాలం అవుతుంది. అందుకు కారణాలు కూడా ఆమె ఇటీవల వెల్లడించారు. బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువ. కొందరు నాకు అవకాశాలు రాకుండా చేశారు. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. దాంతో బాలీవుడ్ నుండి వెళ్ళిపోయాను, అన్నారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ చిత్రాలు, సిరీస్లలో నటిస్తున్నారు.

    ఆమె లేటెస్ట్ ప్రాజెక్ట్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బంది పడ్డానని ప్రియాంక చెప్పడం కొసమెరుపు. ఇక ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది. లాస్ ఏంజెల్స్ లో ఖరీదైన ఇల్లు కొని అక్కడే కాపురం పెట్టింది. ప్రియాంక సరోగసి పద్దతిలో ఒక అమ్మాయిని కన్నారు.