Happy Days Nikhil Role: ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ లో చేరాలి అనే ఆత్రుత కలిగించిన సినిమా ‘హ్యాపీ డేస్’. శేఖర్ కమ్ముల కొత్త వాళ్ళతో తెరకెక్కించిన ఈ చిత్రం ఆరోజుల్లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రం లో ఇంజనీరింగ్ కాలేజీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూపించాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.ఈ సినిమా ద్వారానే వరుణ్ సందేశ్ , నిఖిల్ సిద్దార్థ్ మరియు తమన్నా వంటి నటీనటులు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.
వీరిలో వరుణ్ సందేశ్ రెండు హిట్స్ కొట్టి ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో కెరీర్ ని పోగొట్టుకోగా, నిఖిల్ సిద్దార్థ్ మాత్రం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజిని ఏర్పాటు చేసుకున్నాడు.ఇక తమన్నా గురియించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది,ఆమె ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.అదేమిటంటే ఈ చిత్రం రిపీట్ గా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి చూడడానికి కారణం రాజేష్ పాత్ర.ఈ పాత్రని నిఖిల్ సిద్దార్థ్ పోషించాడు.అయితే శేఖర్ కమ్ముల ఈ క్యారక్టర్ ని తొలుత ప్రముఖ హీరో నితిన్ తో చేయిద్దామని అనుకున్నాడట.
ఆయనని సంప్రదించారట కూడా, అందరూ కొత్తవాళ్లే ఉన్నారు, ఇక నేను వాళ్ళ మధ్యలో ఎందుకు, ఆ పాత్రని కూడా కొత్త వాళ్ళతో చెయ్యిస్తేనే ఆ ఫీల్ ఉంటుందని నితిన్ సున్నితంగా రిజెక్ట్ చేసాడట.దీనితో ఆ పాత్ర కోసం శేఖర్ కమ్ముల ఆడిషన్స్ చేసి నిఖిల్ సిద్దార్థ్ ని తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈ పాత్ర తర్వాత నిఖిల్ రేంజ్ మారిపోయింది. సినిమా నుండి బయటకి వచ్చిన తర్వాత మనం మర్చిపోలేని పాత్ర ఏదైనా ఉందా అంటే అది ఇదే అని చెప్పొచ్చు.