Priyanka Chopra: తన ప్రతీ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ని తనతో పాటు పది మెట్లు పైకి ఎక్కించే దర్శకుడు రాజమౌళి(SS Rajamouli). మగధీర నుండి మొన్న విడుదలైన #RRR వరకు రాజమౌళి సినిమా ప్రస్థానాన్ని, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్వర్ణయుగ ప్రస్థానం గా భావించవచ్చు. #RRR తో ఆస్కార్ అవార్డు ని మన ఇండస్ట్రీ కి తీసుకొచ్చిన రాజమౌళి, ఇప్పుడు ‘వారణాసి'(Varanasi Movie) తో ఏకంగా హాలీవుడ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో లో రాజమౌళి విజన్ ని చూస్తే ఆయన ఈ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నాడో అందరికీ అర్థం అయ్యింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు మేకర్స్.
అయితే రీసెంట్ గానే ఆమె ఒక ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, వారణాసి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం నా కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది అని, రాజమౌళి తో కలిసి పని చేయడం, ప్రతీ రోజు ఒక థ్రిల్లింగ్ అనుభూతి అని, ఈ సినిమా కోసం అక్షరాలా 1300 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. ఒక సినిమాకు ఈ రేంజ్ బడ్జెట్ ని ఖర్చు చేయడం ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎప్పుడూ కూడా జరగలేదు. కేవలం వారణాసి విషయం లోనే ఇది జరుగుతుంది. దీన్ని బట్టీ ఈ చిత్రాన్ని రాజమౌళి ఏ రేంజ్ లో తెరకెక్కినబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.
రీసెంట్ గానే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇందులో ఆయన మహేష్ బాబు కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం చాలా మంది సీనియర్ హీరోలని సంప్రదించారట. లుక్ టెస్ట్స్ కూడా చేశారట. కానీ చివరకు ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేశారు. ఆయన క్యారక్టర్ కూడా ఇందులో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని టాక్. ఇక ఈ సినిమాలో విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన థీమ్ సాంగ్ ని మూవీ టీం విడుదల చేయగా, దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.