Homeఎంటర్టైన్మెంట్The Paradise new release date: నాని 'ది ప్యారడైజ్' కొత్త విడుదల తేదీ ప్రకటన..లేటెస్ట్...

The Paradise new release date: నాని ‘ది ప్యారడైజ్’ కొత్త విడుదల తేదీ ప్రకటన..లేటెస్ట్ పోస్టర్ అదిరిపోయింది!

The Paradise new release date: వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ తన మార్కెట్ పరిధి ని సినిమా సినిమాకు పెంచుకుంటూ వెళ్తున్న నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) , ఈసారి పాన్ ఇండియా వైపు కన్నేస్తూ చేసిన చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie). తనతో గతం లో ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాని హీరో గా నటించడం మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆయనతో పాటు సుధాకర్ చెరుకూరి మరో నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాని ముందుకు మార్చి 26 న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండడం తో అది సాధ్యం అవ్వలేదు. అయితే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

ఈ ఏడాది ఆగస్టు 21న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ తో ఈ విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్ లో రక్తంలో ముంచిన జెడలను మనం చూడొచ్చు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల లో ఎంత క్రియేటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ది బెస్ట్ ఔట్పుట్ ఇవ్వడానికి మరింత సమయం కావాలి . అందుకే ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నామము’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విడుదల తేదీ పై అభిమానులు కాస్త అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆగస్టు నెలలోనే వర్షా కాలం మొదలు అవుతుంది కాబట్టి. జనాలు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసే మూడ్ లో ఉండరు, కాబట్టి టాక్ వచ్చినా నష్టాలను చూడాలేమో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర భాషల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో పాన్ వరల్డ్ చిత్రం గా విడుదల కాబోతుంది.

ఇకపోతే ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా టీజర్ థీమ్ మ్యూజిక్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఈ మ్యూజిక్ తో వందల కొద్దీ ఎడిటింగ్ వీడియోస్ వచ్చాయి . దీంతో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. మరి ఆ అంచనాలను మొదటి పాట తో అందుకుంటాడో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ మంచు మోహన్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, సంపూర్ణేష్ బాబు నాని కి స్నేహితుడి పాత్ర పోషిస్తున్నాడు.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version