ఒక్కో పోస్ట్ కి 3 కోట్లు.. ‘ప్రియాంక’ రికార్డ్ !

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది అంటే.. కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కు నచ్చదు గానీ, ప్రియాంక క్రేజ్ ముందు ఏ బాలీవుడ్ స్టార్ హీరో పనికిరాడు అనేది తేలిపోయింది. ఎందుకంటే ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ పోస్ట్ చేయాలంటే ఏకంగా ఒక్క పోస్ట్ కి 3 కోట్ల రూపాయలు తీసుకుంటోందట. ఇంత భారీ మొత్తం తీసుకుంటున్న ఏకైక ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. షారుక్, […]

Written By: admin, Updated On : July 2, 2021 5:34 pm
Follow us on

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది అంటే.. కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కు నచ్చదు గానీ, ప్రియాంక క్రేజ్ ముందు ఏ బాలీవుడ్ స్టార్ హీరో పనికిరాడు అనేది తేలిపోయింది. ఎందుకంటే ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ పోస్ట్ చేయాలంటే ఏకంగా ఒక్క పోస్ట్ కి 3 కోట్ల రూపాయలు తీసుకుంటోందట. ఇంత భారీ మొత్తం తీసుకుంటున్న ఏకైక ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.

షారుక్, సల్మాన్ లాంటి మాస్ హీరోలకు కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు. ఎంతైనా ప్రియాంకది గ్లోబల్ రేంజ్ క్రేజ్ కదా. ఇక బాలీవుడ్ హీరోయిన్లు ఒక్కో పోస్ట్ కి 8 నుంచి పది లక్షలు తీసుకుంటున్నారని… అది కూడా అందరికీ ఇవ్వట్లేదు అని తెలుస్తోంది. ప్రియాంక చోప్రాకి ఎందుకు అంత భారీగా ఇస్తున్నారంటే.. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 65 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఆరున్నర కోట్లు మంది.

మొత్తానికి ప్రియాంక సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ పెంచుకొని యాడ్స్ పోస్ట్ లతో కూడా ఫుల్ గా సంపాదిస్తుంది. అన్నట్టు ‘ప్రియాంక చోప్రా’ తన భర్త నిక్ తో ఒంటరిగా గడపడానికి అందమైన విలాసవంతమైన బంగ్లాను కట్టుకుని.. తన దాంపత్య జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంది. పైగా ప్రియాంక బంగ్లా పై ఇప్పటికే అనేక గాసిప్స్ కూడా వినిపించాయి.

ప్రియాంక చోప్రా కుర్ర భర్త నిక్ జోనాస్ అమెరికన్ సింగర్ గా బాగానే పాపులారిటీ సంపాదించిన కానీ ప్రియాంక సంపాదన ముందు అతని సంపాదన తేలిపోతుందట. ఏది ఏమైనా ప్రియాంకా చోప్రా అంటే ఒకప్పటి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. హిందీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి .. ఆ తర్వాత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో రెచ్చిపోతూ గ్లామర్ ప్రపంచం పై తన మార్క్ చూపిస్తోంది.