కేవలం డబ్బులు కోసమే మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాను అంటూ మొహమాటం లేకుండా చెప్పిన పవన్ కళ్యాణ్ మొత్తానికి బాగానే సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహార వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ ను హైదరాబాద్ లోని ఓ పాత బిల్డింగ్ లో శరవేగంగా జరుపుకుంటుంది.
అలాగే వచ్చే వారం నుండి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మూవీకి కూడా పవన్ డేట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి గానూ పవన్ కి ఏకంగా ఏభై కోట్లు ఇస్తున్నారట. మరి ఒక్కో సినిమాకి ఏభై కోట్లు తీసుకుంటున్నాడు కాబట్టే, పవన్ కళ్యాణ్ తాజాగా ఓ లగ్జరీ కారును బుక్ చేశాడు. రేంజ్ రోవర్ ఎస్‌యూవీ 3.0 మోడల్ కారును పవన్ బుక్ చేసినట్లు.. దీని ఖరీదు రూ. 4 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

ఈ రేంజ్ కారు ఇప్పటివరకు అతి కొద్దిమంది సెలబ్రిటీల దగ్గర మాత్రమే ఉంది. ఎంతైనా ఈ రేంజ్ రోవర్ కారు అంటేనే ఎంతో క్రేజ్. దేశంలోనే ఈ కారు అత్యంత విలువైనది అని పేరు ఉంది. నిజానికి పవన్ కి ఇలాంటి ఆర్భాటాలు హంగులు నచ్చవు, మరి 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ మోడల్ ను పవన్ తన పేరు మీద ఎందుకు బుక్ చేశాడు ?
పవన్ తన కోసమే బుక్ చేసి ఉంటాడా ? లేక, తన కుటుంబ సభ్యులలో ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి కొని ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం ఇటూ సినిమాలు అటూ రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఎక్కువగా దూర ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఖరీదైన కారును కొన్నాడని పవన్ సన్నిహితులు చెబుతున్నారు.