https://oktelugu.com/

Priyanka Chopra : మహేష్, రాజమౌళి కొత్త షెడ్యూల్ గురించి ప్రియాంక చోప్రా పోస్ట్ వైరల్!

Priyanka Chopra: ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అందుకు సంబంధించిన సెట్ వర్క్స్ ని కూడా పూర్తి చేసిందట మూవీ టీం. ఈ సందర్భంగా ఈ చిత్రం లో నటిస్తున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఒక పోస్ట్ ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 'హలో హైదరాబాద్' అంటూ ఆమె అప్లోడ్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సుమారుగా రెండు మూడేళ్ళ పాటు ఈ సినిమా షూటింగ్ ఉంటుంది కాబట్టి, ఆమె హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసింది.

Written By: , Updated On : March 27, 2025 / 10:18 PM IST
Priyanka Chopra Post

Priyanka Chopra Post

Follow us on

Priyanka Chopra : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ కి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఒడిశా లో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసారు. సుమారుగా రెండు వారాల పాటు సాగిన ఈ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన మూవీ టీం, ఇప్పుడు మళ్ళీ మరో షెడ్యూల్ ని మొదలు పెట్టుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అందుకు సంబంధించిన సెట్ వర్క్స్ ని కూడా పూర్తి చేసిందట మూవీ టీం. ఈ సందర్భంగా ఈ చిత్రం లో నటిస్తున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఒక పోస్ట్ ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘హలో హైదరాబాద్’ అంటూ ఆమె అప్లోడ్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సుమారుగా రెండు మూడేళ్ళ పాటు ఈ సినిమా షూటింగ్ ఉంటుంది కాబట్టి, ఆమె హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసింది.

Also Read : చిరంజీవి కథ ను ఫైనల్ చేసిన అనిల్ రావిపూడి… వైరల్ అవుతున్న పోస్ట్…

ఒడిశాలో షూట్ చేసిన షెడ్యూల్ లో కేవలం ఒకటి రెండు రోజులు తప్ప, దాదాపుగా అన్ని రోజుల్లోనూ ఆమె షూటింగ్ లో పాల్గొన్నది. చూస్తుంటే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మహేష్ తో సమానమైన స్క్రీన్ స్పేస్ ని పంచుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం లో ఆమె మహేష్ కి వెన్నుపోటు పొడిచే క్యారక్టర్ లో నటించబోతుందట. అంటే ఈ క్యారక్టర్ లేడీ కట్టప్ప రేంజ్ లో ఉంటుంది అనుకోండి. ఆమె అలా చేయడానికి వెనుక చాలా భావోద్వేగపూరిత ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. అదే సినిమాలో అది పెద్ద ట్విస్ట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరికొంత మంది అయితే ఈ సినిమాలో ఆమె విలన్ క్యారక్టర్ చేస్తుంది, హీరోయిన్ క్యారక్టర్ మరొకరు చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది.

ఈ రెండిట్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది రాజమౌళి చెప్తే కానీ తెలియదు. ప్రతీ సినిమా షూటింగ్ సమయంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తానూ తీయబోయే సినిమాకు సంబంధించిన విశేషాలు, స్టోరీ లైన్ చెప్పే అలవాటు ఉన్న రాజమౌళి, ఈ సినిమాకు మాత్రం ఇంకా ఎలాంటి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయలేదు. కానీ రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రెస్ మీట్ ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టమైంది. ఇకపోతే ఈ చిత్రం లో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు, పృథ్వీ రాజ్ మధ్య ఒక కీలక సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో, ఎవరో దానిని రికార్డు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. అప్పటి నుండి రాజమౌళి తన షూటింగ్ లొకేషన్ లో భద్రత చాలా పటిష్టంగా ఏర్పాటు చేశాడు.