https://oktelugu.com/

Bigg Boss fame Vasanthi : బెట్టింగ్ యాప్స్ ద్వారా బిగ్ బాస్ ఫేమ్ వాసంతి ఏడాదికి ఇంత సంపాదించిందా!

Bigg Boss fame Vasanthi: సోషల్ మీడియా లో ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల ఇంతమంది నష్టపోతున్నారని మాకు తెలియక చేసాము అంటూ చెప్పుకొస్తున్నారు. వారిలో బిగ్ బాస్(Bigg Boss Telugu) బ్యూటీ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) కూడా ఒకరు.

Written By: , Updated On : March 27, 2025 / 10:27 PM IST
Bigg Boss fame Vasanthi

Bigg Boss fame Vasanthi

Follow us on

Bigg Boss fame Vasanthi : బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ ద్వారా సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే దాదాపుగా 30 మంది టాప్ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు, ఇప్పుడు కొత్తగా మరికొందరిపై కేసులు నమోదు చేయబోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సెలబ్రిటీలను విడిచి పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న కూడా అసెంబ్లీ సాక్షిగా అధికారిక ప్రకటన చేశాడు. దీంతో సోషల్ మీడియా లో ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల ఇంతమంది నష్టపోతున్నారని మాకు తెలియక చేసాము అంటూ చెప్పుకొస్తున్నారు. వారిలో బిగ్ బాస్(Bigg Boss Telugu) బ్యూటీ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) కూడా ఒకరు.

Also Read : మహేష్, రాజమౌళి కొత్త షెడ్యూల్ గురించి ప్రియాంక చోప్రా పోస్ట్ వైరల్!

సీరియల్స్ ద్వారా పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ కి, సోషల్ మీడియా లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు, వీడియోలకు పెద్ద సంఖ్యలో లైక్స్, వ్యూస్ వస్తుంటాయి. అందుకే ఈమెను కూడా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రొమోషన్స్ కోసం బాగా సంప్రదించే వారు. దీనిపై వాసంతి మాట్లాడుతూ ‘పెద్ద పెద్ద సెలెబ్రిటీస్ సైతం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటే, అందులో తప్పు లేదేమో అని అనుకొని నేను కూడా ప్రమోట్ చేయడం మొదలు పెట్టాను. దీని వల్ల ఇంతమంది నష్టపోతున్నారని మాత్రం నాకు అప్పట్లో తెలియలేదు. నన్ను అనుసరించే అభిమానులు ఒకానొక సందర్భంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం పై నన్ను తిట్టారు. ఫాలోవర్లు కూడా బాగా తగ్గిపోయారు. నేను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ద్వారా కొంతమంది అభిమానులు నష్టపోయారని తెలిసింది. చాలా బాధ పడ్డాను. అప్పటి నుండి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపేసాను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘అప్పట్లో నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తామంటూ ముందుకు వచ్చేవారు. 5 లక్షలు, 10 లక్షలు ఏడాదికి ఇస్తాము, మీరు వీడియో కూడా చేయాల్సిన అవసరం లేదు, కేవలం మా యాడ్ ని మీ సోషల్ మీడియా లో షేర్ చేయండి అనేవాళ్ళు. ఇప్పటికీ అలాంటి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. నా అభిమానులకు నష్టం వచ్చే పనులు ఇక నుండి చేయను అని వీడియో చేసి వదిలేశాను’ అంటూ చెప్పుకొచ్చింది వాసంతి కృష్ణన్. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇలాంటి చిన్న సెలబ్రిటీస్ ప్రభావితం అవ్వడానికి పెద్ద సెలబ్రిటీలు కారణం అయ్యారా?, వీళ్లపై కచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద సెలబ్రిటీని శిక్షించినప్పుడే, శాశ్వతంగా ఆ భయం సెలబ్రిటీలతో ఉండిపోతుంది అంటూ కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : చిరంజీవి కథ ను ఫైనల్ చేసిన అనిల్ రావిపూడి… వైరల్ అవుతున్న పోస్ట్…