Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది, కాబట్టి.. అమ్మడు ఏమి చేసినా వార్త అయిపోతుంది. తాజాగా ప్రియాంక చోప్రా తనకు ఎంతో ఇష్టమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును అమ్మేసింది. పెళ్లైన తర్వాత ప్రియాంక అమెరికాలోనే ఉంటుంది. దీంతో రోల్స్ రాయిస్ కారును వాడే అవకాశం ఆమెకు రావడం లేదు అట. అందుకే.. దాన్ని అమ్మేసింది. ఓ వ్యాపారవేత్త ఈ కారును కొన్నట్టు తెలుస్తోంది.

ఇంతకీ ఈ కారును ప్రియాంక చోప్రా ఎంతకు అమ్మిందో తెలుసా ? రెండున్నర కోట్లకు. అయినా అమ్ముకోవడం ప్రియాంక చోప్రాకి కొత్తేమి కాదు. ఆమె ఇప్పటికే చాలా అమ్ముకుంది. ప్రియాంకకు ఇండియాలో కోట్లల్లో ఆస్తులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబై, గోవాలో విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి. హీరోయిన్ గా ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ తో గోవాలో ఓ విలువైన విల్లాను కొనుక్కుంది. ఆ తరువాత ఆ విల్లాని షారుఖ్ పూర్తిగా ఈ గ్లోబల్ బ్యూటీకే ఇచ్చేశాడు.
Also Read: ‘డాడీ’ గా మెగాస్టార్.. ‘బ్రో’ గా నాని.. కలయిక అదిరిపోయింది !
అయితే ఆ మధ్య ప్రియాంక గోవాలోని తన రెండు అపార్ట్‌మెంట్లను అమ్ముకుంది. అలాగే ముంబైలో ఉన్న తన షాపింగ్ మాల్ ను కూడా ఆమె అమ్మేసింది. ఇక మహారాష్ట్రలోని అంధేరీలో తన తండ్రి నుండి ప్రియాంకకి ఓ బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్ ను రూ. 13 కోట్లకు గత ఏడాది మార్చిలోనే అమ్మేసింది. ముంబైలోని తన భారీ భవంతిని కూడా అద్దెకిచ్చింది.
మొత్తమ్మీద ప్రియాంక చోప్రా గత కొన్ని నెలలుగా ఇండియాలోని ఆస్తులు అమ్ముకుంటూనే ఉంది. దాంతో ‘మా ప్రియాంక చోప్రా’కి ఏమి కష్టం వచ్చింది ? ఆమె ఎందుకు తన ఆస్తులు అమ్ముకుంటుంది ? అని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రియాంక.. ఒషివారాలోని తన రెండంతస్తుల ఆఫీసును కూడా అమ్ముకుంది.

అప్పుడంటే.. అమెరికాలో ఇల్లు కట్టుకుంటుంది కాబట్టి, డబ్బు అవసరం అయి ఉంటుంది, దాంతో అమ్మేసుకుని ఉండి ఉంటుంది అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఎందుకు ప్రియాంక ఇలా వరుసగా ఆస్తులు అమ్ముకుంటుందో అని ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయినా ఇలా ఉన్నవన్నీ అమ్మేసుకుని అమెరికా పోయి భర్త చేతిలో పెడితే… భవిష్యత్తులో ఆ భర్తతో తేడా జరిగితే ఏమిటి పరిస్థితి ? ప్రియాంక చోప్రా ఇది ఎందుకు ఆలోచించడం లేదు. అసలు ఉన్నవన్నీ అమ్ముకుంటూ పోతే ఎలా అమ్మడు.. ? అని నెటిజన్లు ప్రియాంక చోప్రా పై సెటైర్లు వేస్తున్నారు.
Also Read: ‘రాజమౌళి’ విజయాల వెనుక కారణం అదేనా ?