Priyanka Mohan about Pawan Kalyan: మరో 8 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన మోస్ట్ క్రేజీ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ అభిమానుల్లో ఒక పక్క టెన్షన్, మరో పక్క ఆనందం పెరిగిపోతుంది. టెన్షన్ దేనికంటే ఆయన గత చిత్రం ‘హరి హర వీరమల్లు’ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన స్ట్రోక్ నుండి అభిమానులు ఇంకా తేరుకోలేదు. ఓజీ చిత్రం అలా ఉండకూడదు,ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ అద్భుతంగా ఉంది, సినిమా కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. థియేట్రికల్ ట్రైలర్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబందించిన అప్డేట్ ఈరోజు లేదా రేపటి లోపు రావొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్(Priyanka Arul Mohan) ప్రొమోషన్స్ ని మొదలు పెట్టేసింది.
నిన్న ఒక్క రోజే ఆమె అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది, అదే విదంగా కొన్ని టీవీ షోస్ లో కూడా తళుక్కుమని మెరిసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అదృష్టం మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ, ఓజీ చిత్రం లో మాత్రం ఆయన తో కలిసి చేసిన ప్రయాణాన్ని జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేను. ఇందులో నేను పోషించిన కన్మణి అనే పాత్ర, ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ది బెస్ట్ క్యారక్టర్ అని చెప్పుకోవచ్చు. అందరూ ఈ చిత్రాన్ని కేవలం యాక్షన్ చిత్రం అనుకోని పొరపాటు పడుతున్నారు. కానీ ఇది మంచి ఫ్యామిలీ డ్రామా తో కూడిన యాక్షన్ చిత్రం. కన్మణి అనే అమ్మాయితో గంభీర గాఢమైన ప్రేమలో పడి, అతని జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత చోటు చేసుకున్న సందర్భాలు ఈ చిత్రాన్ని కీలక మలుపు తిప్పుతుంది’.
‘OMI క్యారక్టర్ చేసిన ఇమ్రాన్ హష్మీ తో కూడా నాకు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందు సెట్స్ లో ఎప్పుడూ ఎదో ఆలోచిస్తూ ఉండేవాడు. సెట్స్ కి వచ్చిన తన పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తూ ఉండేవాడు. కానీ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయనలో నేను చాలా మార్పులు గమనించాను, ఎప్పుడూ లేని విధంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వడం చూసాను, చాలా ప్రశాంతం గా తన బాధ్యతలను నిర్వహించడం కూడా చూసాను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక మోహన్. ఆమె మాట్లాడిన ఈ మాటలు అభిమానులను ఎంతో ఉత్సాహపరిచాయి.