https://oktelugu.com/

తరుణ్ తో వ్యవహారం బయటపెట్టిన హీరోయిన్ !

టాలీవుడ్ లో లవర్ బాయ్ అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు ‘తరుణ్’. ఇప్పుడు అంటే.. తరుణ్ పెద్దగా క్రేజ్ లేని హీరో గానీ, ఒకప్పుడు తరుణ్ అంటే.. టాప్ హీరో. కొన్నాళ్ళపాటు లీడింగ్ హీరో కూడా. బాలనటుడిగా సినిమారంగంలోకి ప్రవేశించి ఆ తరువాత హీరోగా అనేక సినిమాలు చేసి.. వాటిల్లో కొన్ని మంచి హిట్స్ కూడా అందుకున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడుగానూ తరుణ్ కి అప్పట్లో ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. కానీ టైం ఎప్పుడూ ఒకేలా […]

Written By: , Updated On : November 15, 2020 / 05:09 PM IST
Follow us on

Tarun
టాలీవుడ్ లో లవర్ బాయ్ అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు ‘తరుణ్’. ఇప్పుడు అంటే.. తరుణ్ పెద్దగా క్రేజ్ లేని హీరో గానీ, ఒకప్పుడు తరుణ్ అంటే.. టాప్ హీరో. కొన్నాళ్ళపాటు లీడింగ్ హీరో కూడా. బాలనటుడిగా సినిమారంగంలోకి ప్రవేశించి ఆ తరువాత హీరోగా అనేక సినిమాలు చేసి.. వాటిల్లో కొన్ని మంచి హిట్స్ కూడా అందుకున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడుగానూ తరుణ్ కి అప్పట్లో ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ప్రస్తుతం హీరోగా బాగా వెనుకబడి చాలాకాలంగా సినిమాలు లేకుండా ఖాళీగా ఏదో బిజినెస్ చేసుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తున్నాడు.

Also Read: సినిమాలు ఆపేస్తానని చెప్పేవాడట !

కానీ తరుణ్ కి సంబంధించిన ఓ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్ చల్ చేస్తూనే ఉంది. తరుణ్ తో కలిసి ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది బ్లాక్ బ్యూటీ ప్రియమణి. అయితే తనకు తరుణ్ కి మధ్య పుట్టిన పుకార్ల వ్యవహారాల గుట్టును చాల పద్దతిగా బయటపెట్టింది ప్రియమణి. తాజాగా ప్రియమణి ఎన్టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తరుణ్ కి, తనకు సంబంధించిన ఓ విశేషాన్ని పంచుకుంది. తరుణ్ తో తాను “నవ వసంతం” సినిమాలో నటిస్తోన్న సమయంలో తమ మధ్య ప్రేమ చిగురించినట్లు పుకార్లు రేగాయని, ఒకరోజు తాను షూటింగ్ లో ఉండగా తరుణ్ తల్లిగారు సెట్ కి వచ్చి మీ ఇద్దరి బంధాన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పేసరికి నేను షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది.

Also Read: హనీమూన్ లోనూ కాజల్ సంపాదన ఆగట్లేదు !

మరి ఈ సంగతి తరుణ్ కి తెలుసో లేదో. అయినా, తరుణ్ కి తెలియకుండా.. ప్రియమణిని రోజారమణి ఎందుకు అడుగుతుంది అనేది కొంతమంది నెటిజన్ల ప్రశ్న. ఏది ఏమైనా ఈ సంఘటన పై ప్రియమణి మాత్రం విచిత్రంగా స్పదించింది. అసలు తమ మధ్య అలాంటిదేమీ లేదు. మరి అలాంటపుడు తరుణ్ తల్లిగారు తమ ప్రేమను అంగీకరించామని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించిందని తాజాగా ప్రియమణి అమాయకంగా చెప్పడంతో మళ్ళీ ఈ న్యూస్ తరుణ్ ను వార్తల్లో నిలిచేలా చేసింది. ఇక తరుణ్ ప్రస్తుతం నలభై ఏళ్ల వయసుకు చేరువలో ఉన్నాడు. కానీ ఇంతవరకూ వివాహం కాలేదు. త్వరలోనే తరుణ్ వివాహం చేసుకుని సెటిల్ అయిపోవాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్