
జూన్ 4న ప్రియమణి బర్త్ డే ను పురస్కరించుకొని ప్రియమణి భారతక్క అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రియమణి తాజాగా చిత్రం ‘విరాటపర్వం’. ఈ మూవీలో ప్రియమణి నక్సలైట్ గా నటిస్తుంది. ‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది.. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట పర్వంలో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం’ అంటూ ప్రియమణి ఫస్ట్‌లుక్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
ఇందులో ప్రియమణి ఎలాంటి లేకుండా సాదాసీదాగా నల్లటి డ్రెస్ లో బ్యాగ్ భుజన వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ కన్పిస్తుంది. గన్ పట్టుకుని ‘కామ్రేడ్ భారతక్క’ పాత్రలో ఇమిడిపోయినట్లు కన్పిస్తుంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కన్పించిన ప్రియమణి సడెన్ గా నక్సలైట్ పాత్రలో కన్పించడంతో అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. ఈ మూవీకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవల సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా కూడా విరాటపర్వం నుంచి ఆమెకు సంబంధించిన ఫస్టు లుక్ రిలీజైంది. అమరవీరుల స్థూపం దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్న సాయి పల్లవి లుక్ విడుదల చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 1980లో తెలంగాణ పల్లెల్లో జరిగిన సాయుధ పోరాటం, బ్యాక్ డ్రాప్లో సాగే అందమైన ప్రేమకథగా ‘విరాటపర్వం’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. సాయిపల్లవి, ప్రియమణి ఫస్టు లుక్ రిలీజ్ కావడంతో ఇకపై రానా లుక్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. సాయిపల్లవి ట్వీటర్లో ‘భరతక్క’కు బర్త్ డే విషెస్ తెలిపింది.