https://oktelugu.com/

కరోనా పై పాటను రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తీ మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఐతే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఇప్పట్లో కరోనా కి వాక్సిన్ వచ్చే అవకాశం లేదు కాబ్బటి కరోనా భారిన పడకుండా మనందరం జాగ్రత్త ఉంటూ, లొక్డౌన్ సమయం లో ఎలా ఐతే […]

Written By:
  • admin
  • , Updated On : December 24, 2020 2:40 pm
    Follow us on

    ap-corona-song

    కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తీ మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఐతే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.

    ఐతే ఇప్పట్లో కరోనా కి వాక్సిన్ వచ్చే అవకాశం లేదు కాబ్బటి కరోనా భారిన పడకుండా మనందరం జాగ్రత్త ఉంటూ, లొక్డౌన్ సమయం లో ఎలా ఐతే మనం పోలీసులుకు, వైద్య సిబ్బందికి సహకరించామో అదే రీతిన ఇక పై కొనసాగాలని, కరోనా వల్ల, దెబ్బ తిన్న మన జీవితాలని మళ్ళీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలనీ అర్ధం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైస్సార్సీపీ రాజ్య సభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి యంగ్ హీరో నిఖిల్ తో కలిసి ఓ పాట ని సిద్ధం చేయించారు.

    ఈ పాటకు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి కాన్సెప్ట్ ని రెడీ చేశారు. అలానే ఈ పాట కు ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. అలానే ఈ పాటలో వివిధ రంగాలకు చేసిన ప్రముఖులు కనిపించారు., వారిలో కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, సుధీర్ బాబు, పి వి సింధు తదితరులు ఉన్నారు. మనం అంతా కలిసి కరోనా ని అడ్డుకోవాలి అని చాటి చెప్పే రీతిన ఈ పాటను తాజాగా విజయ్ సాయి రెడ్డి విడుదల చేశారు