https://oktelugu.com/

మోడీ ఇక్కడ.. ప్రభుత్వ సంస్థల బలి.. ‘ప్రైవేటు’కు తలుపులు బార్లా!

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇన్నాళ్లు ఒక భరోసా.. ఆ కుటుంబానికి ఒక అండ.. ఒక్కరికి వస్తే.. ఇక వారి మనవళ్లకు ఒక బిందాస్. అయితే ప్రైవేటు రంగం కథ వేరు. అక్కడ పనిచేస్తేనే పైసలు.. ప్రభుత్వ ఉద్యోగంలో అడిగే వారు ఉండరు. వేల జీతం… రిటైర్అయ్యే వరకు ఏలాంటి ఒత్తిడులు ఉండవు.. అదే ప్రైవేటు ఉద్యోగంలో తుమ్మితే ఊడిపోయే జాబులు.. సెలవులకు జీతాలు కటింగులు.. ఎప్పుడు పోతుందో అభద్రత.. అలాంటి ప్రైవేటు చట్రంలోకి కేంద్రప్రభుత్వం అందరినీ తీసుకెళుతోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2021 / 10:06 AM IST
    Follow us on

    ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇన్నాళ్లు ఒక భరోసా.. ఆ కుటుంబానికి ఒక అండ.. ఒక్కరికి వస్తే.. ఇక వారి మనవళ్లకు ఒక బిందాస్. అయితే ప్రైవేటు రంగం కథ వేరు. అక్కడ పనిచేస్తేనే పైసలు.. ప్రభుత్వ ఉద్యోగంలో అడిగే వారు ఉండరు. వేల జీతం… రిటైర్అయ్యే వరకు ఏలాంటి ఒత్తిడులు ఉండవు.. అదే ప్రైవేటు ఉద్యోగంలో తుమ్మితే ఊడిపోయే జాబులు.. సెలవులకు జీతాలు కటింగులు.. ఎప్పుడు పోతుందో అభద్రత.. అలాంటి ప్రైవేటు చట్రంలోకి కేంద్రప్రభుత్వం అందరినీ తీసుకెళుతోంది. అంతేకాదు.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు దోచిపెడుతూ వారి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడంపై ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

    తాజాగా కేంద్రప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతు చట్టాలతో ఎవరినీ సంప్రదించుకుండా చేసిన వైనం దేశాన్ని అట్టుడికేలా చేస్తోంది. ఇప్పుడు నష్టాల పేరుతో ( కొన్ని లాభాల్లో ఉన్నా కూడా) ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది.

    ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో వెల్లడించే అవకాశం ఉందని తెలిపింది. బడ్జెట్ లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగు కంపెనీల ప్రైవేటీకరణ, ఒక మెగా ఐపీవో ఉండవచ్చని తెలుస్తోంది.

    లాభాల్లో ఉన్న సంస్థలను కూడా కేంద్రం ప్రైవేటీకరిస్తూ ఆ సంస్థ ఉద్యోగులను గొంతు కోస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్) వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి అంశాన్ని కూడా కేబినెట్ లో పరిశీలించినట్లు తెలియడంతో ఆ కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

    ఇక దేశ ప్రజలందరూ ఎంతో విశ్వాసంతో నమ్మే.. జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తొలి పబ్లిక్ ఆఫర్ ఉంటుందని.. గత బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి రూ.2.1 లక్షల కోట్ల బారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని వెల్లడించారు. అయితే కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి.

    ఇక ఇదే కాదు.. భారత్ పెట్రోలియం, కంటైనర్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేటషన్ ల ప్రైవేటీకరణకు 2019 నవంబర్ లో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎయిర్ ఇండియాతోపాటు ఈ కంపెనీల ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది.

    మొత్తం బంగారు బాతుగుడ్డు లాంటి దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు దోచుపెడుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కంపెనీల ద్వారా ప్రభుత్వానికి డబ్బులు, లాభాలు వస్తే అది దేశ ప్రజలందరికీ చెందుతాయని.. ప్రైవేటుకు ఇస్తే అది ఎవరికి అందుతాయని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని..కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణను పార్లమెంట్ లో అడ్డుకోవాలని కార్మికులు కోరుతున్నారు.