Prithviraj Sukumaran plays a key role in Pawan Kalyan OG Movie
OG Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టాయి. ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాయనే చెప్పాలి.
ఇక ఇప్పటికైనా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ అనే రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అయితే ఎలక్షన్స్ తర్వాత ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమాలో మలయాళ స్టార్ హీరో అయిన ‘పృథ్వి రాజ్ సుకుమారన్’ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయిపోయాక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న తర్వాత పృథ్విరాజ్ కుమారన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ ని తెరకెక్కించే విధంగా డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ కాస్టింగ్ భారీ గా పెరిగిపోతుంది. ఇక ఈయన రాకతో అది మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రొడ్యూసర్ ఎక్కడ కూడా తగ్గకుండా సుజీత్ కి ఏం కావాలో అది ఇస్తూ సినిమా బాగా వచ్చే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
ఇక రీసెంట్ గా ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న పృథ్వి రాజ్ సుకుమారన్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆయన ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడా? నెగటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడా? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…