Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే నేడు ప్రసారం కానుంది. హౌస్లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక, అర్జున్ టైటిల్ రేసులో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. టాప్ 5 మాత్రమే ఫైనల్ కి వెళతారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఈసారి ఆరుగురిని ఫైనల్ కి పంపారు. ఇప్పటికే ఫినాలే షూటింగ్ పూర్తి అయ్యింది. దీంతో సమాచారం లీక్ అవుతుంది. అర్జున్ అంబటి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడట.
అనంతరం ప్రియాంక ఎలిమినేట్ అయ్యిందట. 6వ స్థానం అర్జున్ కి, 5వ స్థానం ప్రియాంక జైన్ కి దక్కాయట. టాప్ 4 మెంబర్స్ కి నాగార్జున మనీ ఆఫర్ చేశాడట. విన్నర్ ఒకరే అవుతారు. టైటిల్ గెలిచిన వాళ్లకు మాత్రమే ప్రైజ్ మనీ దక్కుతుంది. కాబట్టి నమ్మకం లేనివాళ్లు సూట్ కేసు తీసుకుని టైటిల్ రేసు నుండి తిప్పుకోవచ్చని చెప్పాడట. చాలాసేపటి వరకు ఎవరూ నాగార్జున ఆఫర్ కి టెంప్ట్ కాలేదట.
శివాజీ, ప్రశాంత్, అమర్ ల కంటే తాను స్ట్రాంగ్ ప్లేయర్ కాదని భావించిన యావర్… నాగార్జున ఆఫర్ చేసిన రూ. 15 లక్షలు తీసుకుని టాప్ 3 నుండి యావర్ వైదొలిగాడట. ఇక యావర్ నిష్క్రమణతో టైటిల్ రేసులో అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ ఉన్నారట. యావర్ డబ్బులు తీసుకుని మంచి పని చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆర్థికంగా కానీ యావర్ కి ఈ డబ్బులు ఎంతో కొంత ఉపయోగపడుతుంది.
ప్రేక్షకులు ఏమనుకుంటారో అనుకుని ముందుకు వెళితే తనకు ఒక్క రూపాయి దక్కేది కాదు. ఇక యావర్ రెమ్యూనరేషన్ వారానికి రూ. 1 లక్ష అని సమాచారం. కాబట్టి రూ. 15 లక్షలు అతనికి రెమ్యూనరేషన్ రూపంలో దక్కనున్నాయి. మొత్తంగా బిగ్ బాస్ షోతో టవర్ కి రూ. 30 లక్షలు వచ్చాయన్న మాట. యావర్ స్పై బ్యాచ్ లో ఒకడు. ఇతడు శివాజీ, ప్రశాంత్ తో స్నేహం చేశాడు. మధ్యలో రతిక లవ్ ట్రాక్ లో పడి గేమ్ లో వెనుకబడ్డాడు.