Homeఎంటర్టైన్మెంట్Prince Yavar : మరొకరితో జతకట్టిన ప్రిన్స్ యావర్ లవర్ పావని.. రీఎంట్రీ ఇస్తూనే షాక్!

Prince Yavar : మరొకరితో జతకట్టిన ప్రిన్స్ యావర్ లవర్ పావని.. రీఎంట్రీ ఇస్తూనే షాక్!

Prince Yavar : నీతోనే డ్యాన్స్ 2. 0 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్ తో పోలిస్తే ఈసారి జోడీలు డాన్స్ అదరగొడుతున్నారు. సెలెబ్రెటీ జంటల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఊహించని సంఘటన షో లో చోటు చేసుకుంది. ముఖ్యంగా యావర్ కి మాత్రం మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే .. రీసెంట్ గా విశ్వ కి జోడిగా చేస్తున్న నేహా షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మెడకు గాయం కావడంతో బెల్ట్ పెట్టుకుని షో లోకి వచ్చింది.

తనకు గాయం అయిన కారణంగా షోలో ఇకపై పార్టిసిపేట్ చేయలేనని చెప్పుకొచ్చింది. దీంతో విశ్వ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక తాజా ప్రోమోలో తనతో కలిసి డ్యాన్స్ చేయడానికి మరో పార్ట్నర్ వచ్చిందంటూ విశ్వ చెప్పాడు. ఆమె ఎవరని చూడగా అంతా షాక్ అయ్యారు. విశ్వ కి జోడిగా వచ్చింది మరెవరో కాదు నయని పావని. రావడంతోనే డాన్స్ కుమ్మేసింది. ఆమెను చూసి యావర్ కంగుతిన్నాడు. యాంకర్ శ్రీముఖి, జడ్జిలతో సహా అంతా ఆశ్చర్యపోయారు.

ఇంతలో శ్రీముఖి చూశావా యావర్ అని అనగానే యావర్ సీరియస్ అయ్యాడు. షో లో ఒకరు నీ మీద ఆధారపడి ఉన్నారంటే .. వాళ్లకి నువ్వు సపోర్ట్ చేయాలి అంటూ యావర్ నయని ని నిలదీశాడు. దీంతో నయని మాట్లాడుతూ ఏడ్చేసింది. ‘ నేను ఎంత బాధ అనుభవించానో నాకే తెలుసు .. నా ఫ్యామిలీ బాధ్యత చూసుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను .. నాకు బాగా లేకపోతే నా ఫ్యామిలీ ని ఎవరు చూసుకుంటారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

దీంతో శ్రీముఖి, సదా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. నీతోనే డాన్స్ మొదటి వారంలో నయని పావని, యావర్ కి జోడిగా వచ్చింది. ఏమైందో ఏమోగానీ .. అనూహ్యంగా షో నుంచి తప్పుకుంది. నయని రీప్లేస్ చేస్తూ వసంతిని జోడిగా తెచ్చుకున్నాడు యావర్. ఇప్పుడు సడన్ గా నయని మరొక కంటెస్టెంట్ విశ్వ కి జోడిగా రావడంతో షాక్ తగిలినట్లయింది. బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన యావర్, పావని సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో సంథింగ్ సంథింగ్ అనే పుకార్లు వినిపించాయి.

Neethone Dance 2.0 -Promo | Nayani & Vishwa | Super Star Round | Sat- Sun at 9 PM | StarMaa

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version