Superstar Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక స్టార్ గా సాధించిన విజయాలు ఎలాంటివో మన అందరికి తెలిసిందే..అతని సినిమా విడుదలైంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది..టాక్ తో సంబంధం లేకుండా అవలీల గా ఆయన సినిమాలు వంద కోట్ల షేర్ మార్కుని అందుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాము..కేవలం సినిమా హీరో గా మాత్రమే కాదు..వ్యాపారవేత్తగా కూడా మహేష్ బాబు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.

ఎన్నో కమర్షియల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు, ఆసియన్ సంస్థ తో చేతులు కలిపి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లో AMB సినిమాస్ ని నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే..హైదరాబాద్ లో ఉన్న అన్ని మాల్స్ కంటే అత్యాధునిక టెక్నాలజీ తో నిర్మితమైన మాల్ గా AMB సినిమాస్ కి సిటీ లో ఒక బ్రాండ్ ఇమేజి ఉంది..ఎంత చెత్త సినిమా అయినా ఇక్కడ హౌస్ ఫుల్స్ పడాల్సిందే..అలాంటి బ్రాండ్ ఇమేజి కేవలం AMB సినిమాస్ కి మాత్రమే సాధ్యం అని చెప్పాలి.
అలా ఏషియన్ సంస్థ వారితో ప్రారంభించిన మొదటి ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో..ఇప్పుడు మహేష్ బాబు ఏషియన్ వారితో కలిసి ఫుడ్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం..ఏషియన్ నమ్రత పేరు తో మహేష్ బాబు బంజారా హిల్స్ లో ఒక హోటల్ ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది..ఇప్పటికే ఈ హోటల్ కి సంబంధించిన నిర్మాణం మొత్తం పూర్తి అయ్యిందని..అతి త్వరలోనే దీనిని ఘనంగా ప్రారంబించబోతున్నారని తెలుస్తుంది.

ప్రపంచం లో ఉన్న అన్ని కాంటినెంటల్ ఫుడ్ ఇక్కడ అందుబాటులో ఉంటాయట..ఇక్కడ ఈ హోటల్ గ్రాండ్ గా సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ హోటల్స్ ని ప్రారంభించడానికి మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నాడట..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి..ఇప్పటికే ఫుడ్ బిజినెస్ లోకి సుందీప్ కిషన్, తరుణ్ ,అల్లు అర్జున్ మరియు నాగ చైతన్య వంటి వారు ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అయ్యారు..ఇప్పుడు మహేష్ బాబు కూడా అలా సక్సెస్ అవుతారో లేదో చూడాలి.