Prema Vimanam: హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ప్రేమ విమానం. శాన్వీ మేఘన హీరోయిన్. అనసూయ మరో ప్రధాన పాత్ర చేసింది. జీ 5లో అక్టోబర్ 12 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ప్రేమ విమానం ఎలా ఉందో చూద్దాం…
ప్రేమ విమానం మూవీ 1990లలో జరిగిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. అప్పుల బాధ భరించలేక అనసూయ భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. కటిక పేదరికంలో అనసూయ కుటుంబాన్ని అతికష్టం మీద పోషిస్తుంది. అదే సమయంలో ఆమె ఇద్దరు కుమారులకు విమానం అంటే పిచ్చి. ఒక్కసారైనా ఎక్కాలనే ఆశ. మరోవైపు పక్క గ్రామంలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన ప్రేమ కథ నడుస్తుంది. ఇంట్లో వాళ్ళు బయట సంబంధాలు చేస్తున్న క్రమంలో ఇద్దరూ దుబాయ్ పారిపోవాలి అనుకుంటారు. అనసూయ దాచుకున్న డబ్బులతో పిల్లలు విమానం ఎక్కాలని పారిపోతారు…
ఈ రెండు కథలకు లింకేంటి? విమానం ఎక్కాలన్న పిల్లల కోరిక తీరిందా? సంగీత్-శాన్వీ దుబాయ్ పారిపోయి పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది కథ. ఈ మూవీ ప్రధానంగా మూడు రకాల ఎమోషన్స్ తో సాగుతుంది. అలాగే రెండు వేర్వేరు కథలను లింక్ చేసి చెప్పే ప్రయత్నం జరిగింది.
ప్రేమ విమానం మంచి చిత్రం. భావోద్వేగాలు పండాయి. అనసూయ నటన, పిల్లలతో ఎమోషనల్ సీన్స్ వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు. వెన్నెల కిషోర్ పంతులు పాత్రలో సినిమాకు హైలెట్ గా నిలిచాడు. విమానం గురించి పిల్లల సందేహాలు, ఆయన సమాధానాలు నవ్వులు పూయిస్తాయని అంటున్నారు. మరోవైపు సంగీత్ శోభన్-శాన్వీ లవ్ ట్రాక్ మెప్పిస్తుంది.
అయితే ఎమోషన్స్ పూర్తి స్థాయిలో వెండితెరపై ఆవిష్కృతం కాలేదు. రెండు కుటంబాల కథల్లో ఏదీ బలంగా ప్రేక్షకుడిని కదిలించలేదని అంటున్నారు. అందులోనూ కొత్తదనం లేదని కథ అంటున్నారు. ఇటీవల ఇదే కాన్సెప్ట్ తో విమానం మూవీ విడుదలైంది. లవ్ ట్రాక్ మినహాయిస్తే విమానం ఎక్కాలన్న పాయింట్ సిమిలర్ అని చెప్పొచ్చు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో యావరేజ్ మూవీ. ఈ వీకెండ్ కి ఓసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు.
https://twitter.com/ishukishu210/status/1712492265455935924
https://twitter.com/iamsaisidda/status/1712495737626636681
https://twitter.com/ishankishan32/status/1712496426276766111
#PremaVimanam such a pleasant and sweet movie with beautiful performances from all the lead characters and well crafted emotional scenes makes a perfect family watch this weekend and @vennelakishore kaka acting chimpinavu and @AbhishekPicture production values are good #zee5
— Guna Sekhar@gsk (@dreamerofcinema) October 12, 2023
#PremaVimanam 2.25/5
Below avg— Ram Charan – Jadeja 🔥 (@vinodjaddu8) October 12, 2023