Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడంవల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 13న శుక్రవారం 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
శభ కార్యక్రమాల్లోపాల్గొంటారు. దూరమైన వారు దగ్గరవుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది.
వృషభం:
తొటివారి సలహాలతో ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలు బలపడుతాయి. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఏర్పుడుతాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉండేప్రయత్నం చేయండి.
మిథునం:
ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు. రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్తిక కపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.
కర్కాటకం:
సమాజంలో గౌరవం తగ్గకుండా మెలగాలి ఉండాలి. మనోధైర్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరం.
సింహం:
ఆర్థికపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రారంభించబోయే పనుల్లో అవగాహన లోపం ఉండకూడదు.
కన్య:
ఆర్తికంగా బలపడుతారు. కొంచెం ప్రయత్నిస్తే అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధువులపై ప్రేమతో ఉంటారు. కొన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.
తుల:
తోటివారి సహకారంతో ఒక పని పూర్తవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
వృశ్చికం:
అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇబ్బంది పెడుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదరైనా మనోధైర్యంతో ముందుకు సాగాలి.
ధనస్సు:
ప్రతిభతో ఆకట్టుకుంటారు. మంచి ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది.
మకరం:
కుటుంబ అభివృద్ధఇ కోసం చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం గొప్ప కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి.
కుంభం:
ఆరోగ్యం విషయంలో ఒత్తిడి లేకుండా గడపాలి. కలహాలతో కాలాన్ని వృథా చేసుకోవద్దు. సంపూర్ణ మనోబలంతో విజయం సాధిస్తారు. పక్కనున్న వారే మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
మీనం:
ముందస్తు ప్రణాళికలతో విజయం సాధిస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అవుతారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళితే సత్ఫలితాలు ఉంటాయి.