మరోవైపు మాన్సీ కోపంతో ఉండగా నీరజ్ వచ్చి ప్రశ్నిస్తాడు. దాంతో తనకు ఇకపై అంతా హోదా ఉండదు అంటూ చెప్పేసరికి.. నీరజ్ కోపం అవుతూ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అవును అంటూ రేపటితో అన్ని మార్పులు ఉంటాయని అను ఈ ఇంటికి కోడలు అవుతుంది అంటూ పెద్ద కోడలి హోదాగా తనకు ఉండాల్సిన బాధ్యతలు తనకు ఉంటాయని కానీ మనం ఇలాగే ఉంటాము అంటూ మాట్లాడుతుంది. మనకు కూడా ఆస్తులు పంచాలి అంటూ హోదాల గురించి మాట్లాడేసరికి మాన్సీ మాటలకు నీరజ్ ఫైర్ అవుతూ అరుస్తాడు. ఆ పక్కనే మీరా వారి మాటలు వింటూ అక్కడికి వచ్చి మంగళ స్నానానికి రమ్మంటున్నారు సార్ అంటూ చెప్పి వెళ్తుంది. వాళ్ల మాటలు వింటూ సంతోషపడుతుంది మీరా.
ఇక ఆర్య దగ్గరికి తమ బిజినెస్ కి సంబంధించిన ఓ వ్యక్తి రావడంతో కాసేపు తమ వ్యాపారం గురించి మాట్లాడుతూ.. జిండే కి సైగ చేస్తాడు ఆర్య. వెంటనే జిండే శుభలేఖలు గురించి ఏమైనా జలంధర్ కార్డ్స్ వచ్చాయేమో అనే ఉద్దేశంతో మాట్లాడగా ఆ వ్యక్తి మామూలుగానే సమాధానం చెబుతాడు. కాని తమ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేశారంటూ స్పెషల్ ఇన్విటేషన్ ఉంటుందంటూ చెప్పేసరికి షాక్ అవుతారు. అంతలోనే ఆర్య తల్లి వచ్చి ఏమైనా పనులు ఉంటే ఇప్పుడే చూసుకోవాలి అంటూ తర్వాతకు బయటికి వెళ్ళకూడదు అని చెబుతుంది. ఇక జలంధర్ కొంతమందిని పెళ్లిలో ఆర్య పరువు తీయడానికి రెడీ చేశాడు. వారికి ఎలా ఉండాలో వివరిస్తాడు.
మాన్సీ తన అత్త దగ్గరికి వచ్చి అందరి ముందు వ్యాపారంలో భాగస్వామ్యం, అనుతో సమాన హోదా కావాలని అనడంతో అందరు షాక్ అవుతారు. జిండే ఇది అడగాల్సిన సందర్భం కాదు అనేసరికి.. మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం మీరు సైలెంట్ గా ఉండండి అంటూ జిండేపై అరుస్తుంది. ఇక ఆర్య తల్లి జిండే ఇంట్లో వ్యక్తి అనేసరికి మరింత కోపంతో రగిలిపోతుంది. నీరజ్ ఎంత చెప్పినా కూడా మాన్సీ వినకుండా అరుస్తుంది. ఆర్య తల్లి వెంటనే అడగడానికి నీకు అర్హత లేదు అంటూ.. ఎందుకంటే.. అనేసరికి జిండే వచ్చి అమ్మ అని ఆపుతాడు. అయినా కూడా మాన్సీ నాకు తెలియాలి అనేసరికి నీరజ్ కోపంతో అన్నయ్య గురించి మాట్లాడితే నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధమే అంటూ చెప్పేసరికి అందరు షాక్ అవుతారు.