కానీ అను రాజనందినిగా పూర్వజన్మలో పుట్టిన సంగతి తనకు తెలియక పోవడంతో తనకు గత జన్మలో చేసినవి గుర్తుకు వస్తుంటాయి. ఇక మరోవైపు జలంధర్.. ఆర్య, అను ల పెళ్లిను ఆపడం కోసం.. ఆర్యను మీరాకు దక్కడం కోసం మీరాకు ఒక కొరియర్ పంపిస్తాడు. అందులో లెటర్ తో పాటు మూడు టాబ్లెట్ లను పంపి అనుకి లేదా వాళ్ల తల్లిదండ్రులకు ఎవరికైనా ఇవ్వమని సలహా ఇచ్చి పంపిస్తాడు. మరోవైపు ఆర్య ఫోటో చూసుకుంటూ అను ఆర్య పెళ్లి చేసుకోకపోవడంతో ఫోటోతో మాట్లాడుకుంటూ బాధపడుతుంది. అది చూసిన మాన్సీ తన దగ్గరికి వచ్చి క్లాస్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అను, ఆర్య ల జీవితం బాగుంటుందని లేదంటే అనుకి, నాకు పెట్టిన గొడవలు వాళ్లకి కూడా పెడతావు అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపో ఉంటుంది.
మీరా మాత్రం వెళ్ళను అంటూ శారద మేడం చెప్పిందని వచ్చాను అని అనేసరికి.. వెంటనే మాన్సీ.. తనకు గతంలో చెప్పిన విషయాలను అత్తయ్యకు చెప్పేస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. అంతలోనే శారదాదేవి రావడంతో మీరా ఆఫీస్ పనుల కోసం పెళ్లి తర్వాత ఇక్కడి నుంచి వెళ్తుందట అని ఇరికిస్తుంది. ఇక శారదాదేవి కూడా మాన్సీ మాటలను నమ్మి అవును అని బదులిస్తుంది. ఇక అను రెడీ అవుతున్న సమయంలో తన స్నేహితులు పొగుడుతూ ఉంటారు. అదే సమయంలో సంపత్ వచ్చి అనుకి దిష్టి తీస్తూ కాస్త ఫన్నీ క్రియేట్ చేస్తాడు. అను తల్లి కూడా వచ్చి దిష్టి తీస్తుంది. ఇక ఆర్య కూడా పెళ్ళికొడుకు గెటప్ లో రెడీ అవగా మాన్సీ కాస్త సరదాగా మాట్లాడుతుంది. డోర్ దగ్గర మీరా ఆర్య ను చూస్తూ ఎమోషనల్ గా కనిపిస్తుంది.