https://oktelugu.com/

Game Changer: తమిళనాడు లో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్.. పూర్తి వివరాలు ఇవే!

మన టాలీవుడ్ కి భారీ మార్కెట్ గా పిలవబడే ఓవర్సీస్ లో ఈ రెండు హాలీవుడ్ చిత్రాల ద్వారా షోస్ చాలా తక్కువపడే అవకాశాలు ఉన్నాయి. టాప్ స్క్రీన్స్ కూడా దొరకవు, అందుకే ఈ చిత్రాన్ని జనవరి 10 కి వాయిదా వేశారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 18, 2024 / 11:32 AM IST

    Game Changer(3)

    Follow us on

    Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత, సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేసిన సంగతి అందరికి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, జనవరి 10 న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ముందుగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 25 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించారు. కానీ సోలో రిలీజ్ మాత్రం దొరకడం లేదు. ఈ సినిమా విడుదలయ్యే సమయంలోనే హాలీవుడ్ లో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకున్న ‘ముఫాసా : ది లయన్ కింగ్’ అనే చిత్రంతో పాటు, మరో భారీ హాలీవుడ్ చిత్రం కూడా విడుదల కాబోతుంది.

    మన టాలీవుడ్ కి భారీ మార్కెట్ గా పిలవబడే ఓవర్సీస్ లో ఈ రెండు హాలీవుడ్ చిత్రాల ద్వారా షోస్ చాలా తక్కువపడే అవకాశాలు ఉన్నాయి. టాప్ స్క్రీన్స్ కూడా దొరకవు, అందుకే ఈ చిత్రాన్ని జనవరి 10 కి వాయిదా వేశారు. ఆ తేదీన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ముందుగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ దిల్ రాజు ప్రత్యేకించి రిక్వెస్ట్ చేయడం తో చిరంజీవి తన సినిమాని వాయిదా వేయించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే శంకర్ సినిమాలకు ప్రొమోషన్స్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా అదే తరహా ప్రొమోషన్స్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని అన్ని భాషల్లో కనీవినీ ఎరుగని రేంజ్ లో చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్ కి తమిళం లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శంకర్ బ్రాండ్ కి తమిళ స్టార్ హీరోలకు సమానమైన ఇమేజ్ ఉంది.

    పాజిటివ్ టాక్ వస్తే కేవలం తమిళ వెర్షన్ నుండి ఈ సినిమా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టగలదు. అంతటి స్టామినా ఉన్న మార్కెట్ కాబట్టి, తమిళనాడులో ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ప్లాన్ చేయబోతున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసి, సూపర్ స్టార్ రజనీకాంత్ ని ముఖ్య అతిథిగా పిలవబోతున్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రజినీకాంత్ తో శంకర్ కి మంచి సాన్నిత్యం ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో శివాజీ, రోబో, రోబో 2.0 వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలకు బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఏ రేంజ్ లో వచ్చాయో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం భాషల్లో కళ్ళు చెదిరే రేంజ్ వసూళ్లు వచ్చాయి. శంకర్ స్పెషల్ రిక్వెస్ట్ చేయడం తో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేందుకు రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.