AP Mid Day Meal : ఏపీలో మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి ఆహార మెనూలో మార్పు వస్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం మరో మార్పు దిశగా అడుగులు వేస్తోంది.

Written By: Dharma, Updated On : October 18, 2024 11:34 am

AP Mid day Meal

Follow us on

AP Mid Day Meal :  ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పేరు మారింది. అప్పటివరకు జగనన్న గోరుముద్దగా ఉన్న ఈ పథకం.. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనంగా పేరు మారింది. అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేర్లు పెడతామని పవన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ హామీ మేరకు మధ్యాహ్నం భోజన పథకానికి ఆ పేరు పెట్టింది చంద్రబాబు సర్కార్. అయితే అప్పటివరకు జగన్ సర్కార్ అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూను సైతం మార్చింది.
* ప్రతి సోమవారం కూరగాయల పలావ్, కోడిగుడ్డు కూర, వేరుశనగ బెల్లం చిక్కి అందించాలని నిర్ణయించారు.
* మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావా
* బుధవారం కూరగాయ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి
* గురువారం సాంబార్ బాత్/ లెమన్ రైస్, టమోటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
* శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశెనగ బెల్లం చిక్కి
* శనివారం ఆకుకూర అన్నం, పప్పు చారు, రాగి జావా, స్వీట్ పొంగల్ అందిస్తూ వస్తున్నారు.

* మరింత పౌష్టికాహారం
అయితే రాష్ట్రంలో నిత్యవసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్నం లో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో క్వాలిటీ పెంచుతూ మెనూలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీపావళి నుంచి అమలకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. రెగ్యులర్ భోజనంతో పాటు వారంలో ఐదు రోజులు ఇస్తున్న గుడ్డును.. మూడు రోజులపాటు వేపుడుగా.. మరో మూడు రోజులు కుర రూపంలో ఇవ్వనున్నారు. రాగిజావ తో పాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రై ఫ్రూట్స్ లడ్డును అందిస్తారు. వారంలో ఒకరోజు అరటిపండును కూడా ఇచ్చేందుకు నిర్ణయించారు. మొత్తానికి అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపరచడం విశేషం.