Homeఎంటర్టైన్మెంట్Ghani Movie: ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్.. హైప్ వస్తుందా ?

Ghani Movie: ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్.. హైప్ వస్తుందా ?

Ghani Movie: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గని’ పై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అందుకే.. మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో బాగంగా ఏప్రిల్ 2న గ్రాండ్‌ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు.

Ghani Movie
Ghani Movie

ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రం టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉంది. స్పోర్ట్స్ డ్రామాగా గని చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు.

Also Read: Deepika Padukone : బాలీవుడ్ క్రేజీ బ్యూటీకి అరుదైన అవార్డు

అన్నట్టు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో సిజ్లింగ్ బ్యూటీ తమన్నా హీరయిన్ గా నటిస్తుంది. పైగా ఈ స్పెషల్ సాంగ్ లో వరుణ్ తేజ్‌ తో కలిసి తమన్నా రొమాన్స్ కూడా చేసింది. మొత్తానికి తమన్నా ఈ సాంగ్ లో నటించడంతో గని సినిమా పై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా అవుట్ ఫుట్ అంత గొప్పగా ఏమి లేదు అని తెలుస్తోంది. కానీ, ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహం కనిపించబోతున్నాడు.

Ghani Movie
Ghani Movie

వరుణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీనీ కూడా పెంచాడు. బాక్సర్‌ పాత్ర కాబట్టి.. ఈ పాత్ర కోసం వరుణ్‌తేజ్‌ కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు. మరి గనితో వరుణ్ తేజ్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి.

ఇక ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మొదటిసారిగా నిర్మాతగా మారుతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అందుకే ఈ సినిమా హిట్ బాబీకి కీలకం కానుంది.

Also Read: Aryan Khan: ప్చ్.. ఆ స్టార్ హీరో కొడుకుని వదిలేలా లేరు

Recommended Video:

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Oktelugu Epaper