https://oktelugu.com/

Prathinidhi 2 Review: ప్రతినిధి 2 మూవీ రివ్యూ…

నారా రోహిత్ హీరోగా ప్రముఖ మీడియా పాత్రికేయుడు అయిన మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో వచ్చిన 'ప్రతినిధి 2 ' సినిమా ఈరోజు రిలీజ్ అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 10, 2024 / 10:56 AM IST

    Prathinidhi-2-Movie-Review

    Follow us on

    Prathinidhi 2 Review: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎలక్షన్ ఫీవర్ నడుస్తుంది. ఎవరికి వాళ్లు ఆయా పార్టీలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ గెలుపు ఒకటే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో పొలిటికల్ హీట్ పెంచడానికి కొన్ని సినిమాలు కూడా పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతూ ప్రేక్షకుడిని ఆకర్షిస్తూ ఉన్నాయి.

    ఇంకా అందులో భాగంగానే నారా రోహిత్ హీరోగా ప్రముఖ మీడియా పాత్రికేయుడు అయిన మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతినిధి 2 ‘ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. రోహిత్ హీరోగా ఒక 10 సంవత్సరాల కిందట వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని రూపొందించారు… అయితే ఈ సినిమా ఎలా ఉంది నారా రోహిత్ ఈ సినిమాతో మరొక సక్సెస్ ని అందుకున్నారా? మూర్తి తన డైరెక్షన్ తో ఈ సినిమా సక్సెస్ తీరాలకు చేర్చారా? లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిసి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఎవ్వరికి భయపడకుండా నిప్పులాంటి నిజాన్ని బయటపెడుతూ నేరం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి అనే ఉద్దేశ్యం తో జర్నలిస్ట్ చేతన్ (నారా రోహిత్) ఉంటాడు. ఇక చిన్నప్పుడు తనకు జరిగిన కొన్ని సంఘటనల వల్లనే తను ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని జర్నలిస్టుగా మారి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఇలాంటి సమయంలో ప్రిలాన్స్ జర్నలిస్టుగా చేస్తూ నిజాలను బయటికి తీస్తూ చాలామంది దోషులను పట్టిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎన్ ఎన్ సి ఛానల్ ఏరికోరి మరీ అతన్ని సీఈఓ గా నియమిస్తుంది. ఇక అప్పటినుంచి ఆయన రాజకీయ పెద్దలుగా చెప్పుకునే చాలామంది జీవితాలను బట్టబయలు చేస్తూ వాళ్ల చీకటి బాగోతాలను బయట పెడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ముఖ్యమంత్రి అయిన ప్రజాపతి (సచిన్ ఖేడెకర్) మీద హత్యయత్నం జరుగుతుంది. ఈ హత్యను చేయించింది ఎవరు? ఆయనకి ఉన్న శత్రువులు ఎవరు? అనే అంశాన్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా కథ సాగుతుంది. మరి ఇంతకీ ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే డైరెక్టర్ మూర్తి ఈ సినిమాని చాలా రియలేస్టిక్ సీన్స్ ని వాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. రాజకీయ నాయకుల చేతిలో మోసపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమా ద్వారా తమ తమ రియల్ ఇన్సిడెంట్లను గుర్తు చేసుకుంటాడు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది చెబుతూనే, ఒక అవినీతిపరుడైన నాయకుడు సమాజానికి ఎలాంటి కీడు చేస్తాడు అనే అంశాలను కూడా ఈ సినిమాలో చూపించారు. ఇక ఓటు యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేశారు. నిజానికి నారా రోహిత్ చేసిన ఈ పాత్ర ఆయనకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్రతినిధి సినిమాలో ఆయన పోషించిన ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం ఆ సినిమాలో చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ అయింది. అలాంటి పాత్రలో నారా రోహిత్ అద్భుతంగా మెప్పించాడనే చెప్పాలి.

    నిజానికి నారా రోహిత్ మూర్తి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అదొక రాజకీయ పార్టీకి అనుకూలంగా వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సిచువేషన్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు… ఇక చేతన్ ఎన్ ఎన్ సి సీఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి సినిమా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళుతుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా చాలా కాంప్లికేటెడ్ సీన్స్ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూనే దాన్ని ఈజీగా ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యే విధంగా కన్ క్లూజన్ ఇస్తూ వచ్చారు.

    ఇక మంత్రి గజేంద్ర (అజయ్ ఘోష్) చేసిన అఘాయిత్యాన్ని జనాలకు తెలిసేలా చేయడం ఆయన మంత్రి పదవి పోవడం, ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసే నరసింహ (పృథ్వీరాజ్)చీకటి కోణాలను బయటికి తీసుకురావడం ఇలాంటి సీన్లు ప్రేక్షకుడిని చాలా వరకు ఎంగేజ్ చేస్తాయి. ఇక ఓటు విలువ తెలియజేసే సీన్స్ కూడా ఈ సినిమాకి చాలా ప్రధాన బలంగా మారాయి. ఇక ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక ట్విస్ట్ ప్రేక్షకుడిని చాలా వరకు థ్రిల్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఈ సినిమా స్టోరీలో కొంచెం స్వేచ్ఛని ఎక్కువగా తీసుకొని కొన్ని నమ్మశక్యం కానీ సీన్లను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే చేశారు. అందులో ఒకటి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ మీద బాంబు వేయడం. ఆ విషయం మీద కేంద్రమంత్రి స్పందించేంత వరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియక పోవడం అనేది నమశక్యంగా అనిపించని సన్నివేశాలు…

    ఇక ‘ఫస్ట్ హాఫ్ లో కలం పట్టిన హీరో సెకండాఫ్ లో కత్తిపడతాడు’. ఇక అందులో భాగంగానే పాటలు, ఫైట్లు చేస్తూ రెగ్యూలర్ కమర్షియల్ సినిమా పాటర్న్ లో సాగుతుంది… ఫస్టాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ప్రేక్షకుడిని అంత ఎంగేజ్ చేయలేదనే చెప్పాలి… ఇక జర్నలిస్ట్ గురించి చెప్పిన డైలాగులు మాత్రం అద్భుతంగా పేలాయి.దేశాన్ని కాపాడటానికి సైనికుడు, కడుపు నింపడానికి రైతు ఎంత ముఖ్యమో, సమాజాన్ని బాగు చేయడానికి జర్నలిస్టు కూడా అంతే ముఖ్యం అనే విధంగా చెప్పిన డైలాగులు సినిమాకి చాలా హైలెట్ గా నిలిచాయి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నారా రోహిత్ ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక ఇలాంటి జర్నలిస్టు పాత్రలు ఆయనకు చాలా బాగా సెట్ అవుతాయి. అందుకే తను ఏరీకోరీ మరి ఈ సినిమాని ఎంచుకొని చేసినట్టుగా అనిపించింది. ఇంక చాలా సంవత్సరాల నుంచి ఆయన సినిమాలైతే చేయడం లేదు. కాబట్టి ఇది ఆయనకి ఒక మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. ఇక మిగిలిన ఆర్టిస్టులు అయిన సచిన్ ఖేడేకర్, అజయ్ ఘోష్, తనికెళ్ళ భరణి లాంటి నటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మహతి స్వర సాగర్ సాంగ్స్ అంత అద్భుతంగా లేకపోయినప్పటికీ బిజీ ఎం తో అయితే ఓకే అనిపించాడు. ఇక సినిమా విజువల్స్ పరంగా చూసుకుంటే నాని చముడిశెట్టి చాలా అద్భుతమైన విజువల్స్ అయితే అందించాడు. సినిమా అవుట్ ఫుట్ నెక్స్ట్ లెవెల్లో రావడానికి ఆయన చాలావరకు హెల్ప్ అయితే చేశాడు… ఎడిటర్ ఇంకొంచెం షార్ప్ గా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి…

    ప్లస్ పాయింట్స్

    నారా రోహిత్
    కథ
    క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్

    మైనస్ పాయింట్స్

    స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం..
    కథలో డ్రామా కొంత వరకు మిస్ అయింది..
    కొన్ని సీన్లు నమ్మశక్యం కానీ విధంగా ఉన్నాయి…

    రేటింగ్

    ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5/5

    చివరి లైన్

    పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడాలి…