Mahindra Scorpio : ఒకప్పుడు వ్యవసాయాన్ని చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి కొన్ని పనులను ఈజీగా చేస్తున్నారు. వ్యవసాయంలో మొదటి ఘట్టం పొలాన్ని చదును చేయడం. పొలాన్ని దున్నడానికి ఒకప్పడు నాగలిని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ట్రాక్టర్లతో చదును చేస్తున్నారు. అయితే ఓ రైతు కారుతో పొలాన్ని చదును చేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. తారు రోడ్డుపై మాత్రమే వెళ్లే కారు మట్టి, రాళ్లు ఉండే పొలంలో నాగలిని తీసుకెళ్లే ఈ కారు కంపెనీపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
భారతదేశం 75 శాతం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ వ్యవసాయం చేసి వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయం చేయడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వివిధ పద్ధతుల ద్వారా సులభంగా చేస్తున్నారు. ట్రాక్లర్లు, యంత్ర పరికరాల ద్వారా వ్యవసాయ పనులు ఈజీగా చేస్తున్నారు. కానీ లేటేస్టుగా ఓ రైతు కారుతో పొలం దున్నడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యవసాయ పనులు చేసిన కారు మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో. ఇది ఏకంగా నాగలిని లాగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
రాహుల్ రావ్ సాహెబ్ అనే వ్యక్తి తన ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో వైట్ లో ఉన్న స్కార్పియో కారు పొలంలో ఓ వ్యవసాయ పరికరాన్ని లాగుతుంది. విచిత్రమేంటంటే ఈ కారులో డ్రైవర్ కూడా లేడు. కానీ ఆ కారు యంత్రాన్ని లాగుతూ వెళ్తుంది. అంటే మహీంద్రాకు చెందిన స్కార్పియో కారు తారు రోడ్డుపై మాత్రమే కాకుండా వ్యవసాయ పనులను కూడా చేసే శక్తి ఉందని ఈ వీడియో సందర్భంగా రైతు చెబుతూ ఉంటాడు. ఎంతటి శక్తినైనా తట్టుకునే శక్తి స్కార్పియోకు ఉందని పరోక్షంగా చెబుతూ ఉంటాడు.
సాధారణంగా వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ ను మాత్రమే ఉపయోగిస్తాం. కానీ కారుతో కూడా వ్యవసాయ పనులు చేయొచ్చని, అదీ మహీంద్రా కు చెందిన స్కార్పియోతోనే సాధ్యమని ఈ వీడియో కింద పలువురు కామెంట్లు పెట్టారు. వ్యవసాయంలో వివిధ ప్రయోగాలు చేసే రైతులు ఇప్పటి వరకు అన్ని రకాల వాహనాలను ఉపయోగించారు. కానీ ఈ రైతు ఎస్ యూవీ కారు అయినా మహీంద్రా స్కార్పియోతో వ్యవసాయ పనులు చేయడం ఆసక్తిగా మారిందని కొందరు అంటున్నారు.