Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరనేంతలా ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక అలాంటి రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది…రీసెంట్ గా బాహుబలి సినిమా రిలీజ్ కి సంబంధించిన ఇంటర్వ్యూలో రాజమౌళి పాల్గొన్నారు… ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజమౌళిని ఉద్దేశించి ఆయన అప్పులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు నాకు తెలుసు అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజంగానే రాజమౌళి కి అప్పులు ఉన్నాయా? సినిమాకి 100 నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే రాజమౌళికి అప్పులు ఉండటం ఏంటి? అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి రాజమౌళికి అప్పులైతే ఉన్నాయట.
Also Read: ‘బిగ్ బాస్ 9’ తనూజ పై సెటైర్ల వర్షం కురిపించిన ‘బిగ్ బాస్ 8’ యష్మీ..వీడియో వైరల్!
అవి ఎందుకయ్యాయి అంటే రాజమౌళి కొడుకు అయిన కార్తికేయకు ఒక బిజినెస్ పనులను అప్పగిస్తే ఆయన దాన్ని నష్టాల్లో మిగిల్చాడని అందువల్లే దానికి సంబంధించిన అప్పును రాజమౌళి కడుతూ వస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత నుంచి అప్పులైతే కట్టుకుంటూ వస్తున్నాడట. ప్రస్తుతానికైతే అప్పులు బాధ తీరినప్పటికి తన దగ్గర డబ్బులు పెద్దగా ఏమీ లేవని తన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
ఇక మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో 3000 కోట్ల కు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి విస్తరింపజేయాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే జరిగితే మాత్రం ఆయనను మించిన దర్శకుడు ఇంకొకకు ఉండరు అనేది స్పష్టమవుతోంది…
ఇక ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ మూవీ రీ రిలీజ్ తో మరోసారి అతను హాట్ టాపిక్ గా మారాడు. ఈ సినిమా 3 గంటల 45 నిమిషాలతో రెండు పార్టులను కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తోంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…