TTD Laddu Case: తిరుమల( Tirumala) లడ్డూ వివాదం పెను ప్రకంపనలకు దారితీసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతంగా సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు గత ఏడాది జూలైలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మొదలు రచ్చ రచ్చ జరిగింది. కోట్లాదిమంది శ్రీవారి భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నారు. గత కొద్దిరోజులుగా విచారణ కొనసాగుతోంది. అయితే ఇటీవల వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు, పీఏ గా భావిస్తున్న వెంకన్న అనే వ్యక్తి అరెస్టయ్యారు. ఆయన అరెస్టు సందర్భంగా ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలను బయటపెట్టింది.
Also Read: ‘బిగ్ బాస్ 9’ తనూజ పై సెటైర్ల వర్షం కురిపించిన ‘బిగ్ బాస్ 8’ యష్మీ..వీడియో వైరల్!
* వై వి సుబ్బారెడ్డి పిఎ..
వాస్తవానికి టీటీడీ( Tirumala Tirupati Devasthanam) అధ్యక్షుడిగా వైవి సుబ్బారెడ్డి ఉండేవారు. ఈయన జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయనను టీటీడీ అధ్యక్షుడిగా నియమించారు. నాలుగేళ్లపాటు ఇదే పదవిలో కొనసాగారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీటీడీ అధ్యక్ష పదవి గురించే.. వై వి సుబ్బారెడ్డి కి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనట్లు ప్రచారం నడిచింది. అయితే ఏకధాటిగా నాలుగేళ్ల పాటు టీటీడీ అధ్యక్షుడిగా కొనసాగారు వైవి సుబ్బారెడ్డి. ఆ సమయంలో ఆయన పిఏగా అప్పన్న ఉండేవారట. అయితే లడ్డు వివాదం బయటకు వచ్చిన తర్వాత దీనిపై సిబిఐ విచారణ కోరుతూ ఇదే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ తోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు అదే దర్యాప్తు బృందం వై వి సుబ్బారెడ్డి ప్రధాన అనుచరుడు, పిఏను అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
* రిమాండ్ రిపోర్టులో..
రిమాండ్ రిపోర్ట్ లో( Remand report ) సంచలన అంశాలు బయటకు వచ్చాయి. వై వి సుబ్బారెడ్డి హయాంలో టీటీడీని వెంకన్న ప్రభావితం చేశారన్నది ప్రధాన అభియోగం. బోలె బాబా సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే కిలో కు 25 రూపాయల వరకు కమీషన్ ను వెంకన్న డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే బోలె బాబా సంస్థ ముందుకు రాకపోవడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి వారికి అవకాశం లేకుండా చేశారట. ప్రీమియర్ ఫుడ్స్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించారని.. కమీషన్ ఇచ్చేందుకు ముందుకు రావడంతోనే అలా చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది దర్యాప్తు బృందం. అయితే ఇలా వచ్చిన సొమ్మును వైవి సుబ్బారెడ్డి కి బదలాయించారని అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. త్వరలో వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.