Prashanth Varma and Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకు ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడంలో కీలకపాత్ర వహిస్తూ వచ్చాడు. ఇక ప్రస్తుతం ఆయన వరుసగా నాలుగు విజయాలతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు తద్వారా ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు బాలయ్య బాబు చేసిన సినిమాలన్నీ కూడా మాస్ యాక్షన్ సినిమాలే కావడం విశేషం… ఇక తన కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుంది అంటూ గత నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్న బాలయ్య బాబు ఎట్టకేలకు ఈ సంవత్సరంలో తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మోక్షజ్ఞకు హ్యాండ్ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీకి సిద్ధం!
ఇక ఇప్పటికే ప్రశాంత వర్మతో మోక్షజ్ఞ (Mokshagna) సినిమాని ఓకే చేసినప్పటికి ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. మరి ఎప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది అనే విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం బాలయ్య బాబు సైతం ప్రశాంత్ వర్మ విషయంలో కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య ప్రశాంత్ వర్మ ను పక్కన పెట్టి వేరే దర్శకుడు కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఇకమీదట ప్రశాంత్ వర్మకి ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా తక్కువనే చెప్పాలి.
ఎందుకంటే బాలయ్య బాబు అతని కోసం దాదాపు సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నప్పటికి ఆ సినిమాని ఇంకా స్టార్ట్ చేయకపోవడం బాలయ్య బాబు లాంటి సీనియర్ హీరోని సైతం అతను అంతలా వెయిట్ చేయించడం చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రశాంత్ వర్మ మీద నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి బాలయ్య బాబుని లెక్క చేయని ప్రశాంత్ వర్మ ప్రొడ్యూసర్స్ ని ఇతర హీరోలని ఇంకేం పట్టించుకుంటాడు అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : ప్రశాంత్ వర్మ ను ముంచిన ఓవర్ కాన్ఫిడెంట్…ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్లే ఆయన బాలయ్య చేతిలో తిట్లు తిన్నాడా..?