https://oktelugu.com/

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ యుద్ధ నేపథ్యం !

సౌత్ స్టార్ డైరెక్టర్స్ లో రాజమౌళి తరువాత ఆ స్థాయి ఉన్న డైరెక్టర్ల లిస్ట్ లో మొదటి ప్లేస్ ‘ప్రశాంత్ నీల్’దే. బాలీవుడ్ జనాలు సైతం ప్రశాంత్ నీల్ పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారంటే అది ప్రశాంత్ డైరెక్షన్ స్కిల్ కి దక్కిన గౌరవం. మరి అలాంటి డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అంటూ గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలకు మోక్షం కలిగింది. ప్రశాంత్ నీల్‌ తో ఎన్టీఆర్ […]

Written By: , Updated On : May 20, 2021 / 03:46 PM IST
Follow us on

NTR Prashant Neelసౌత్ స్టార్ డైరెక్టర్స్ లో రాజమౌళి తరువాత ఆ స్థాయి ఉన్న డైరెక్టర్ల లిస్ట్ లో మొదటి ప్లేస్ ‘ప్రశాంత్ నీల్’దే. బాలీవుడ్ జనాలు సైతం ప్రశాంత్ నీల్ పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారంటే అది ప్రశాంత్ డైరెక్షన్ స్కిల్ కి దక్కిన గౌరవం. మరి అలాంటి డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అంటూ గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలకు మోక్షం కలిగింది.

ప్రశాంత్ నీల్‌ తో ఎన్టీఆర్ 31వ సినిమాని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ ప్రకటనను అధికారికంగా ప్రకటించగా… ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తమ సినిమా గురించి తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ప్రకటన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్- 1 క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి… గొప్ప యాక్షన్ డ్రామాగా నిలిచింది. దాంతో ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియా లెవల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఓ దశలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడు.

కానీ, ప్రశాంత్ నీల్ మాత్రం ప్రభాస్ తో ఆ తరువాత ఎన్టీఆర్ తో సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న సినిమా కథ గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. గతంలో పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో కథ జరుగుతుందట. ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఓ జవాన్ ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో ప్రశాంత్ ఈ సినిమాని తీస్తాడట.