NTR And Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్…ఆయన చేసిన కేజిఎఫ్ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ‘కేజీఎఫ్ 2’ సినిమాతో 1300 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొట్టిన ఆయన ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన ‘సలార్’ సినిమాతో 800 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టాడు… ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తాను చాటుకున్నట్లయితే ఇండియాలో ఆయన టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు. ఇక దానికోసమే తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారట. ఎన్టీఆర్ కి 2000 మందితో ఒక ఫైట్ ని కూడా కంపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఫైట్ ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ చేత డిజైన్ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ని కొత్త లుక్ లో చూపించబోతున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎంతవరకు సక్సెస్ ఫుల్ గా నిలుపగలుగుతాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ లను అందించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు…
ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఏం చెబితే అది చేస్తున్నాడు. తన క్యారెక్టర్ కోసం వెయిట్ తగ్గాలని చెబితే భారీగా తగ్గిపోయాడు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక పేషంట్ ల కనిపిస్తున్నాడు. అలాంటి బాడీ తో తన క్యారెక్టర్ ను ఎలా ఎలివేట్ చేస్తాడు.
ఆ ఎలివేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడు ప్రశాంత్ నీల్ నిజంగానే ఈ సినిమాతో ఎన్టీఆర్ కి భారీ క్రేజ్ ను కట్టబెడతాడా? లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ఇక అదే విధంగా ఈ సినిమా మీద ఎన్టీఆర్ భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. తను కనుక ఈ సినిమాతో సక్సెస్ ని సాధించకపోతే మాత్రం ఇక ఎప్పటికి ఆయన ఇండస్ట్రీ హిట్ ను సాధించడం సాధ్యమవదనే చెప్పాలి.
ఇక ఎందుకంటే ప్రభాస్ స్పిరిట్ సినిమాతో దాదాపు 2,000 కోట్లకు పైన కలెక్షన్స్ కి కొల్లగొడతాడనే అంచనాలైతే ఉన్నాయి. ఇక మహేష్ బాబు – రాజమౌళి సినిమా వచ్చిందంటే మాత్రం అది 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి అంత పెద్ద రికార్డులను బ్రేక్ చేయాలి. ఇండస్ట్రీ హిట్ ను సాధించాలంటే అది ఎన్టీఆర్ సాధ్యమయ్యే పనైతే కాదు…