Akhanda 2 Twitter Talk: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమయ్యాయి. ఎన్నో అడ్డంకులను దాటుకొని , చివరి ఇమిషం వరకు అభిమానులను టెన్షన్ పెడుతూ విడుదలైన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్ లో జరిగాయి. బాలయ్య సినిమాల్లోనే కాదు, గత కొన్నేళ్లుగా విడుదల అవుతున్న సీనియర్ హీరోల సినిమాలకంటే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లో జరిగాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఆల్ టైం రికార్డు గ్రాస్ ని కూడా నెలకొల్పింది. ఏ సినిమాకు అయినా వాయిదాలు పడితే హైప్ పడిపోతుంది, కానీ ఈ చిత్రానికి మాత్రం వాయిదా పడిన తర్వాత హైప్ పెరిగింది. అయితే ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత సోషల్ మీడియా లో ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
Ballayya back to his original Genre pic.twitter.com/shpEcGNGHl
— Barbarik (@barbaarik) December 11, 2025
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే, ఆరంభం నుండి చివరి వరకు నాన్ స్టాప్ గా ఎలివేషన్ సన్నివేశాలతో జెట్ స్పీడ్ లో స్క్రీన్ ప్లే నడుస్తుందని అంతా ఆశిస్తారు. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో చాలా స్లో గా, ఫ్లాట్ గా ఉందని చూసిన ప్రతీ ఒక్కరు ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు. కేవలం ఇంటర్వెల్ సన్నివేశం తప్ప, ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేవని, సెకండ్ హాఫ్ కోసం మంచి స్టేజ్ ని సెట్ చేసారని అని చెప్పుకొచ్చారు. బోయపాటి శ్రీను ప్రతీ సినిమాలో సెకండ్ హాఫ్ బాగుంటుంది. ముఖ్యంగా ఆయన బాలయ్య తో తీసే ప్రతీ సినిమాలో సెకండ్ హాఫ్ వేరే లెవెల్ లో ఉండే లాగా ప్లాన్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా దరిద్రం గా ఉందని చెప్పుకొచ్చారు.
Intervel
Navvuthunnar amma #Akhanda2Thandavam #Akhanda2#Akhanda2Thaandavam pic.twitter.com/F2HxQSCnX1— El Dorado (@RebelHemsworth) December 12, 2025
మహాశివుడి ఎలిమెంట్ ని ఇష్టమొచ్చినట్టు వాడేశారని, ‘అఖండ’ చిత్రం లో ఉన్న ఎమోషన్, ‘అఖండ 2’ లో ఇసుమంత కూడా లేదని, ఫైట్ సన్నివేశాలు హద్దులు దాటి పెట్టారని, అవి చూసే ఆడియన్స్ కి నవ్వు రప్పించేలా ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియా లో కొన్ని ఫైట్ సన్నివేశాలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ఆడియన్స్. ఓవరాల్ గా ఉన్న హైప్ కి ఈ చిత్రం బిలో యావరేజ్ రేంజ్ లో తీసినా వర్కౌట్ అయ్యేది. కానీ బోయపాటి శ్రీను నుండి ఇలాంటి చెత్త స్టఫ్ ని అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ట్విట్టర్ లో ఈ సినిమాని చూసిన వారు చెప్తున్న కామెంట్స్ కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
#Akhanda2 An Underwhelming Mass Entertainer with a few mass sequences that work but the rest disappoints!
The story continues from the first part with a typical Boyapati style treatment. A few mass sequences work, like the intro, interval block, and a block in the second half.…
— Venky Reviews (@venkyreviews) December 11, 2025