Prashanth Neel favorite Telugu heroes: కన్నడ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్… కే జి ఎఫ్ సినిమాతో తన ప్రస్థానాన్ని పాన్ ఇండియా వైడ్ గా విస్తరింపజేసుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సలార్ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించాడు. ముఖ్యంగా ప్రభాస్ ను టాప్ లెవల్లో చూపించి ఆయనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడం విశేషం…ప్రభాస్ లాంటి నటుడు దొరికితే ప్రతి ఒక్కరు ఆయనలోని నట పోటెన్షయాలిటిని బయటికి తీయాలని చూస్తారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ సినిమాలో మాస్ ఎలివేషన్స్ బీభత్సంగా పెట్టి ప్రేక్షకుల యొక్క అటెన్షన్ ని సినిమా మీదికి మళ్ళించాడు. మొత్తానికైతే సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా భారీ లాభాలను కూడా తీసుకొచ్చి పెట్టింది…
ఇక అలాంటి ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు అంటే చాలా ఇష్టం…అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు కావడం విశేషం…
Also Read: పవన్ కళ్యాణ్ కి చదువు నేర్పిన సార్ సాయం కోసం వస్తే ఏం చేశాడో తెలుసా..?
వీరిద్దరి సినిమాలను ఆయన తరచుగా చూస్తూ ఉండేవారట. కే జి ఎఫ్ సక్సెస్ అయ్యేంతవరకు ఆయన తెలుగు సినిమాల వైపే ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అదే కన్నడలో అయితే తక్కువ గా ఉంటుంది.
కాబట్టి తెలుగు లో ప్రయత్నం చేసి అవకాశం దక్కించుకునే కంటే కన్నడలో ఈజీగా సినిమా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో మొదట అక్కడ సినిమాను చేసి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చానని పలు సందర్భాల్లో తెలియజేశాడు… ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాయి. ఆయన చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…