https://oktelugu.com/

ప్రభాస్ పక్కన ఛాన్స్.. ఆ సువర్ణావకాశం మీకు దక్కాలంటే ?

ప్రభాస్.. ఒక తెలుగు హీరో.. కానీ, బాహుబలి సిరీస్ తరువాత ఒక పాన్ ఇండియా స్టార్. నిజానికి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ మాటకొస్తే.. ప్రభాస్ తెలుగులో కూడా ఎప్పుడూ నెంబర్ వన్ పొజిషన్ కి దగ్గర్లో కూడా లేడు. అలాంటి ప్రభాస్ ఒక్క సినిమాతో ఏ స్టార్ హీరోకి దక్కని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు, ప్రభాస్ అనే పేరు ప్రపంచంలో ఏ మూలకి పోయినా టక్కున గుర్తు పట్టే […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 06:04 PM IST
    Follow us on


    ప్రభాస్.. ఒక తెలుగు హీరో.. కానీ, బాహుబలి సిరీస్ తరువాత ఒక పాన్ ఇండియా స్టార్. నిజానికి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ మాటకొస్తే.. ప్రభాస్ తెలుగులో కూడా ఎప్పుడూ నెంబర్ వన్ పొజిషన్ కి దగ్గర్లో కూడా లేడు. అలాంటి ప్రభాస్ ఒక్క సినిమాతో ఏ స్టార్ హీరోకి దక్కని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు, ప్రభాస్ అనే పేరు ప్రపంచంలో ఏ మూలకి పోయినా టక్కున గుర్తు పట్టే రేంజ్ కి వెళ్ళాడు. బాహుబలితో ప్రభాస్ క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకే స్థాయిలో పెరిగిపోయింది కాబట్టే.. ప్రభాస్ నుండి రాబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ సినిమాలే.

    Also Read: ఇంగ్లీష్ సినిమాని కాపీ చేస్తోన్న సీనియర్ హీరో !

    అయితే ఈ మద్యే ప్రభాస్‌ – ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో సలార్ అనే మరో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ పవర్ ‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంలో ప్రభాస్ పక్కన మీరు కూడా నటించాలనుకుంటున్నారా ? అయితే ఇది మీకు సువర్ణావకాశమే. ఇదేదో ఫేక్ పోస్ట్ కాదు.. అతి త్వరలో పట్టాలెక్కనున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా కోసం ప్రస్తుతం మేకర్స్ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించడంతో అవకాశాల కోసం తిరుగుతున్న కొత్త నటీనటులకు ఊపిరి పోసినట్టు అయింది.

    Also Read: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో టాలెంటెడ్ కమెడియన్ కూడా కీలకమేనట !

    కాబట్టి, ఆసక్తి ఉన్నవారు వన్‌ మినిట్‌ వీడియోతో ఈ నెల 15న హైదరాబాద్‌, శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనున్న ఆడిషన్ లో పాల్గొనండి అంటూ ప్రశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఈ ఆడిషన్స్‌ జరగబోతున్నాయి. ఒక్క తెలుగులోనే కాకుండా త్వరలో బెంగళూరు, చెన్నైల్లోనూ ఆడిషన్స్‌ జరగనున్నాయని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు. మరి ఆడిషన్స్ లో సక్సెస్ అయి ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసే ఆ లక్కీ ఫెలోస్ ఎవరో చూద్దాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్