https://oktelugu.com/

ఆ రాజకీయలకు చంద్రబాబు గుడ్ బై..?

చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. నేషనల్ పాలిటిక్స్ లోనూ ఓ వెలుగు వెలిగిన నేత. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో కీలక సూత్రధారిగా వ్యవహరించారు. కేంద్రం లో మూడో కూటమి ఏర్పాటుకు తనదైన ప్రయత్నాలు సాగించారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు. అప్పట్లో జయలలిత, ఫరూక్ అబ్దుల్లా వంటి సీనియర్ నేతలను సయితం హైదరాబాద్ కు రప్పించుకుని మరీ కూటమిని పటిష్టపర్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. Also Read: దూసుకెళ్తున్న ‘బండి’.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 06:02 PM IST
    Follow us on


    చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. నేషనల్ పాలిటిక్స్ లోనూ ఓ వెలుగు వెలిగిన నేత. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో కీలక సూత్రధారిగా వ్యవహరించారు. కేంద్రం లో మూడో కూటమి ఏర్పాటుకు తనదైన ప్రయత్నాలు సాగించారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు. అప్పట్లో జయలలిత, ఫరూక్ అబ్దుల్లా వంటి సీనియర్ నేతలను సయితం హైదరాబాద్ కు రప్పించుకుని మరీ కూటమిని పటిష్టపర్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.

    Also Read: దూసుకెళ్తున్న ‘బండి’.. వీర్రాజుకు సవాల్

    బాబు చొరవ..
    మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వారిని కలిసి కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. కర్ణాటక కు వెళ్లి కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. స్వయంగా కోల్ కత్తా వెళ్లి మమత బెనర్జీకి మద్దతుగా నిలిచారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చంద్రబాబు గట్టిగానే నినదించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగానే ఢిల్లీ సాక్షిగా వినిపించారు.

    మారిన పరిస్థితులు..
    కానీ 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ.. గోర పరాజయం పాలవడంతో.. జాతీయ రాజకీయాలను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అనిపిస్తోంది. తెలంగాణలో పార్టీనే ఆయన పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు డీఎంకే స్టాలిన్ మంచి మిత్రుడు. అయినా కూడా.. ఇప్పుడు స్టాలిన్ కు తమిళనాడులో మద్దతిచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు కనిపించట్లేదు.

    Also Read: ముందు రైతు.. వెనక మోడీ..!

    బీజేపీతో గొడవెందుకు అనేనా?
    తమిళనాడులో తెలుగు ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. స్టాలిన్ తో మిత్రుత్వం, గతంలో ఫ్రంట్ ఏర్పాతు దృష్ట్యా.. చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. కానీ.. ప్రస్తుతం ఆయన సుముఖంగా లేరని సమాచారం. దీనికి కారణం అక్కడ డీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా ఉండటమేనని సమాచారం. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కూడా చంద్రబాబు గట్టి మద్దతుదారు. కానీ.. రాబోలే ఎన్నికల్లో ఆమె పార్టీకి కూడా మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

    ఇంట గెలవాలి…
    గత ఎన్నికల్లో ఓటమితో టీడీపీ శ్రేణులు డీలపడ్డాయి. వైసీపీ రాజకీయంగా మిప్పేట దాడి చేస్తోంది. ఇలాంతి పరిస్థితుల్లో.. “ముందు ఇంట గెలవాలి, ఆ తర్వాతే ఇతర విషయాలు” అనే ఆలోచనలో బాబు ఉన్నట్టు సమాచారం. ఇలాంతి పరిస్తితుల నేపథ్యంలో.. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగినట్లేనని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్