https://oktelugu.com/

బిగ్ బాస్-4 విజేత ఆ ఇద్దర్లోనే..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్-4 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో ఈ సీజన్ లో విజేత ఎవరు? అనే చర్చ మొదలైంది. ఆఖరి నామినేషన్ కూడా మొదలైపోవడంతో.. విన్నర్ ఎవరు అవుతారో అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. ఈ నామినేషన్ ప్రక్రియలో హౌస్ లోని ఆరుగురిలో ఐదుగురిని నామినేట్ చేసాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే విన్ అవ్వడం వల్ల అఖిల్ మినహా అందరూ నామినేట్ అయ్యారు. Also Read: డబ్బుల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 06:14 PM IST
    Follow us on


    బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్-4 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో ఈ సీజన్ లో విజేత ఎవరు? అనే చర్చ మొదలైంది. ఆఖరి నామినేషన్ కూడా మొదలైపోవడంతో.. విన్నర్ ఎవరు అవుతారో అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. ఈ నామినేషన్ ప్రక్రియలో హౌస్ లోని ఆరుగురిలో ఐదుగురిని నామినేట్ చేసాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే విన్ అవ్వడం వల్ల అఖిల్ మినహా అందరూ నామినేట్ అయ్యారు.

    Also Read: డబ్బుల కోసం బూతు సినిమా తీసిన ‘పెద్ద మనిషి’ !

    విన్నర్ వారిలోనే..
    ఈ సారి బిగ్ బాస్ విజేత ఎవరనే అంశంపై ప్రేక్షకుల్లో పెద్ద చర్చే కొనసాగుతోంది. గత మూడు సీజన్స్ లో అబ్బాయిలే గెలిచారు. కాబట్టి, ఈసారి అమ్మాయికి ఛాన్స్ ఇస్తారా? అనే చర్చ ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందచందాలతో పాటు అల్లరితో ఆకట్టుకుంటున్న హారిక.. ఈ సారి బిగ్ బాస్ విజేత అయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ అలరించిన హారికా.. అభిమానులను భారీగానే సంపాదించుకుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన అల్లరితో ఆకట్టుకుంటోంది. ఇక, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను కూడా.. భలేగా ఆడుతోందనే పేరు సంపాదించింది. అంతే కాకుండా.. హారిక తన మనసులో ఏం ఉంచుకోకుండా మాట్లాడుతుందని, నిజాయితీగా గేమ్ ఆడుతుందని, కాబట్టి ఈ సారి హారిక విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. హౌస్ లో అందరితోనూ సరదాగా ఉండే హారిక అభిజిత్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య “సంథింగ్ సంథింగ్” అనికూడా నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఎలిమినేషన్ టైంలో ఆమెకు ప్రేక్షకులు భారీగానే ఓట్లు వేసి బయటపడేశారు.

    Also Read: రొట్ట కొట్టుడుతో ముందుకు పోతే ప్లాప్ లే వస్తాయ్ !

    ఇక బిగ్ బాస్ విజేతలో వినిపిస్తున్న మరో పేరు అభిజిత్. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాలో నటించిన ఈ కుర్రాడు మంచి మార్కులు కొట్టేశాడు. అమాయకంగా, హ్యాండ్సం గా కనిపించే అభిజిత్.. బిగ్ బాస్ హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన ఆట తాను ఆడుతూ వస్తున్నాడు. వచ్చిన మొదట్లో మోనాల్ తో క్లోజ్ గా ఉన్న అభి.. ఆ తరవాత ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. ఆ తర్వాత హారికకు దగ్గరయ్యాడు. ఈ సారి అభిజిత్ విన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. అభిజిత్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నారు. నామినేట్ అయిన ప్రతిసారీ ప్రేక్షకులు ఓట్లు వేసి అభిజిత్ ను ఎలిమినేషన్ నుంచి తప్పిస్తున్నారు. అయితే.. హౌస్ లో ఇంతవరకు ఎప్పుడూ కెప్టెన్ అవ్వలేదు ఈ కుర్రాడు. కానీ ఈ సారి బిగ్ బాస్ టైటిల్ ను మాత్రం కొడతాడని నెటిజన్స్ గట్టిగానే చెప్తున్నారు. సో.. ప్రేక్షకుల అంచనాల ప్రకారం.. హారిక, లేదా అభిజిత్ విజేతగా నిలిచే అవకాశం ఉంది. మరి, ఏం జరుగుతుంది? వీళ్లిద్దరిలో ఒకరు గెలుస్తారా? లేదంటే.. మోనాల్ ను పట్టుబట్టి హౌస్ లో ఉంచుతున్నట్టుగా.. విజయాన్ని కూడా వేరేవారికి కట్టబెడతారా? అన్నది చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్