https://oktelugu.com/

Salaar: సలార్ సినిమా పాటల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నీల్

స్టోరీలో భాగంగానే అన్ని పాటలు బ్యాగ్రౌండ్ లో వస్తూ ఉంటాయి అని తెలుస్తోంది. అయితే సినీ ప్రేక్షకులు మ్యూజిక్ కి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తీసుకున్న నిర్ణయం సినిమాకి సహాయ పడుతుందా లేదా అనేది అందరి సందేహం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 18, 2023 8:05 am
    Salaar

    Salaar

    Follow us on

    Salaar: ప్రస్తుతం ప్రభాస్ వరస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా కానీ ఆయన అభిమానులు ఎక్కువగా సలార్ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాకి కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం. మాస్ పల్స్ బాగా తెలిసిన ఈ డైరెక్టర్ తమ అభిమాన హీరో ప్రభాస్ ని ఎక్స్ట్రార్డినరీగా చూపించి తప్పకుండా బ్లాక్ బస్టర్ ఇస్తారని బలమైన నమ్మకంతో ఉన్నారు.

    ఈ నేపథ్యంలో సలార్ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ తీసుకున్న నిర్ణయం ఒకటి ప్రస్తుతం చెక్కర్లు కొడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ నిర్ణయం ఏమిటి అంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మామూలు సినిమాలలో వచ్చే పాటలు లాగా ఈ సినిమాలో పాటలు పెట్టకూడదు అనుకుంటున్నారట. కానీ ఈ సినిమాలో పెట్టే పాటల ద్వారా ప్రభాస్ బలమైన ఇమేజ్‌ని పెంచాలని ప్లాన్ చేస్తున్నాడట. అది ఎలాగా అంటే సలార్ సినిమాలో వచ్చే ప్రతి పాట కథ జరుగుతూ ఉండగా బ్యాగ్రౌండ్ లోనే వచ్చేటట్టు ఈ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట.

    అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ లో ఆ పాటల ద్వారా ప్రభాస్ హీరోయిజం ని ఎలివేట్ చేయాలి అని కూడా చూస్తున్నారట. అంతేకానీ ఏదో మధ్యలో ఒక పాట పెట్టేయాలి.. హీరోయిన్ పాట ఉండాలి.. ఐటమ్ సాంగ్ ఉండాలి అనే దృష్టితో ఈ సినిమాలో ఏ సాంగ్ ని పెట్టడం లేదట.

    స్టోరీలో భాగంగానే అన్ని పాటలు బ్యాగ్రౌండ్ లో వస్తూ ఉంటాయి అని తెలుస్తోంది. అయితే సినీ ప్రేక్షకులు మ్యూజిక్ కి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తీసుకున్న నిర్ణయం సినిమాకి సహాయ పడుతుందా లేదా అనేది అందరి సందేహం.

    ప్రఖ్యాత సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి కథకు తగ్గట్టు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.