https://oktelugu.com/

Prabhas Salaar: ప్రభాస్ పై ప్రశాంత్ నీల్ తీవ్రమైన అసహనం.. సలార్ షూటింగ్ ఆగిపోనుందా?

Prabhas Salaar: టాలీవుడ్ నుండి నేటి జెనెరేషన్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరు అంటే టక్కుమని గుర్తుకువచ్చే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం ని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..ఒక్కే ఒక్క సినిమాతో ప్రభాస్ ని ఎవ్వరు అందుకోలేని రేంజ్ లో కూర్చోబెట్టాడు డైరెక్టర్ రాజమౌళి..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ 200 కోట్ల రూపాయలకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 8, 2022 / 07:55 AM IST
    Follow us on

    Prabhas Salaar: టాలీవుడ్ నుండి నేటి జెనెరేషన్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరు అంటే టక్కుమని గుర్తుకువచ్చే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం ని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..ఒక్కే ఒక్క సినిమాతో ప్రభాస్ ని ఎవ్వరు అందుకోలేని రేంజ్ లో కూర్చోబెట్టాడు డైరెక్టర్ రాజమౌళి..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించాయి..సాహూ సినిమా అయితే ఏకంగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది..అంతతి అనితర సాధ్యమైన స్టార్ స్టేటస్ ఉన్న ప్రభాస్ ఇప్పుడు సరైన హిట్ కొడితే ఆయనకీ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం పెద్ద కష్టం ఏమి కాదు..అందుకే ఆయన అభిమానులందరూ ఇప్పుడు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా పైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు..అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

    prabhas, prashanth neel

    అదేమిటంటే ప్రభాస్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా తీవ్రమైన అసహనం తో ఉన్నట్టు తెలుస్తుంది..ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు..సలార్ సినిమా తో పాటుగా ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాలు చేస్తున్నాడు..ఒకేసారి మూడు సినిమాలు చెయ్యడం వల్ల ప్రభాస్ లుక్స్ లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి..ఒక్కో సన్నివేశం లో ఒక్కోలాగా కనిపిస్తున్నాడట..ఈ విషయం పై ప్రశాంత్ నీల్ చాలా తీవ్రమైన అసహనం తో ఉన్నట్టు తెలుస్తుంది..సలార్ సినిమాలో ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి..ఇటీవల జరిగిన ఒక షెడ్యూల్ లో కూడా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్..అయితే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేదు.

    prabhas prashanth neel

    ప్రభాస్ డూప్ ని పెట్టి సన్నివేశాలు తెరకెక్కించారు..ఇది ఆ చిత్ర నిర్మాతలకు మరియు ప్రశాంత్ నీల్ కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందట..అందుకే ప్రశాంత్ నీల్ ఆ రెండు సినిమాలు పూర్తి చేసుకొని వచ్చేయండి..అప్పుడే మనం సలార్ సినిమా మిగిలిన షూటింగ్ ని పూర్తి చేద్దాము అని ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అంటే ప్రభాస్ ప్రాజెక్ట్ K మరియు ఆదిపురుష్ పూర్తి చేసే వరుకు సలార్ షూటింగ్ నిలిచిపోనుందా..! లేదా ప్రభాస్ వేరే విధంగా ప్రశాంత్ నీల్ ని డీల్ చేస్తాడా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    Tags