Prasanth Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకులు సైతం పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు సైతం వాళ్ళు చేసే సినిమాలతో భారీ గుర్తింపును సంపాదించుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) లాంటి దర్శకుడు సైతం హనుమాన్ (Hanuman) సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ వర్మ ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు. అందువల్లే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ (Jai Hamuman) సినిమా అనే సినిమాను అనౌన్స్ చేసినప్పటికి ఆ సినిమాలు ఇప్పటివరకు సెట్స్ మీదకి తీసుకురాలేదు. ఇక మోక్షజ్ఞ(Mokshagna) తో సినిమా చేయడానికి సిద్ధమైనప్పటికి ఆ సినిమాని సైతం సెట్స్ మీదకి తీసుకెళ్లడంలో ఆయన చాలా వరకు లేట్ చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబుతో గత కొన్ని రోజుల నుంచి ఆయనకు ఆర్గుమెంట్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ హీరో కి సైతం ఒక కథను చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
Also Read: ఐశ్వర్య రాయ్ తో నటించినందుకు రజినీకాంత్ ఇన్ని అవమానాలు ఎదురుకున్నాడా?
ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ వల్ల ఆయన దాదాపు మరో మూడు సంవత్సరాల వరకు ఖాళీగా అయితే లేడు. మరి ఈ మూడు సంవత్సరాల్లో ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కమిట్ అయిన అన్ని సినిమాలను చేయవచ్చు అయినప్పటికి ఆయన ఏ సినిమా మీద కూడా తన దృష్టి పెట్టడం లేదు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ విభేదాలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ దానివల్ల ఆయన కెరియర్ కు ఏదైనా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయా అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా ఉంటుందా? లేదంటే మరో దర్శకుడి చేతుల మీదుగా ఉంటుందా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.
మరి వీళ్ళ కాంబినేషన్ లో కనక సినిమా వచ్చినట్లయితే భారీ విజయాన్ని సాధిస్తుందని బాలయ్య బాబు (Balayya Babu) భావిస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ ప్రాజెక్టు వర్కౌట్ అవుతుందా? లేదంటే బాలయ్య ప్రశాంత్ వర్మ ను పక్కన పెట్టే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది…