Prasad Multiplexes : ఈమధ్య కాలం లో రీ రిలీజ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లను రాబడుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ లో టాపర్స్ గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) నిలిచారు. వీళ్ళు కాకుండా ప్రభాస్(Rebel star Prabhas), అల్లు అర్జున్(Icon star Allu Arjun) రీ రిలీజ్ సినిమాలకు కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్(Junio NTR), రామ్ చరణ్(Global Star Ram Charan) మాత్రం కేవలం ఒకే ఒక్క సక్సెస్ ఫుల్ రీ రిలీజ్ చిత్రంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రఖ్యాత థియేటర్స్ ఉంటాయి. వాటిల్లో ఒకటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రసాద్ మల్టీప్లెక్స్(Prasad Multiplex). మన చిన్నతనం నుండి ఈ మల్టీప్లెక్స్ గురించి కథలు కథలుగా వింటూ వస్తున్నాం. ఈ మల్టీప్లెక్స్ లో ఎన్నో వందల సినిమాలు సంచలన రికార్డ్స్ ని నమోదు చేశాయి. అదే విధంగా రీ రిలీజ్ చిత్రాలకు కూడా ఈ మల్టీ ప్లెక్స్ అడ్డాగా మారిపోయింది.
అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో ప్రసాద్ మల్టీ ప్లెక్స్ పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాలకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ అత్యధిక గ్రాస్ వసూళ్లు కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే వచ్చాయి. టాప్ 5 చిత్రాల్లో నాలుగు సినిమాలు ఆయనవే ఉండగా, ఒక్కటి మాత్రం మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) చిత్రం ఉన్నది. 2022 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో ఆల్ టైం రికార్డు నెలకొల్పిన జల్సా చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. రెండు రోజుల పాటు ప్రదర్శింపబడిన జల్సా స్పెషల్ షోస్ కి దాదాపుగా 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డుని ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఇక ఆ తర్వాతి స్థానం లో మెగాస్టార్ చిరంజీవి ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి నిల్చింది’.
Also Read : చిన్న సినిమాలను చంపేస్తున్న రివ్యూ రైటర్స్…ఇందులో ఎంత వరకు నిజముంది..?
ఈ నెల 9వ తారీఖున విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు పాతిక లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మరో వారం రోజుల పాటు థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉండడంతో, ఫుల్ రన్ లో 30 లక్షల మార్కుని అందుకునే అవకాశం ఉందట. అదే విధంగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం 19 లక్షల రూపాయిల గ్రాస్ తో మూడవ స్థానంలో, 17 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లతో ‘గబ్బర్ సింగ్’ చిత్రం నాల్గవ స్థానంలో, 12 లక్షల రూపాయిల గ్రాస్ తో తమ్ముడు చిత్రం ఐదవ స్థానం లో నిల్చినట్టు తెలుస్తుంది.