Pranitha: కన్నడ రీమేక్ పోకిరి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ప్రణీత సుభాష్ స్టార్ కాలేకపోయింది. అడపదడపా సూపర్ హిట్స్ ఉన్నా కెరీర్లో ఎదగలేకపోయింది. రెండో చిత్రంతోనే తెలుగులో అడుగుపెట్టింది. 2010లో విడుదలైన ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంలో నటించింది. అనంతరం సిద్దార్థ్ పక్కన బావ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అప్పట్లో సిద్ధార్థ్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. బావ మాత్రం నిరాశపరిచింది. రెండు చిత్రాలు పరాజయం కావడంతో మూడేళ్లు గ్యాప్ వచ్చింది.
అనూహ్యంగా అత్తారింటికి దారేది మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. పవన్ తో ఓ సాంగ్ లో స్టెప్స్ వేసింది. అత్తారింటికి దారేది విజయం ఎన్టీఆర్ సరసన ఛాన్స్ దక్కేలా చేసింది. రభస మూవీలో సమంత, ప్రణీత కాంబినేషన్ రిపీట్ అయ్యింది. ఈసారి మాత్రం సెంటిమెంట్ కలిసి రాలేదు. రభస డిజాస్టర్ అయ్యింది.
ప్రణీతకు తెలుగులో దక్కిన మరో బంపర్ ఆఫర్ బ్రహ్మోత్సవం. ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా ప్రణీత సుభాష్ నటించింది. మహేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం రిజల్ట్ అందరికీ తెలిసిందే. అలా పెద్ద హీరోలతో వచ్చిన ఒకటి రెండు ఆఫర్స్ పరాజయం పొందాయి. ప్రస్తుతం ప్రణీత కెరీర్ నెమ్మదించింది. అందుకే తెలివిగా పెళ్లి పీటలు ఎక్కింది. 2021లో నితిన్ రాజ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.
ప్రణీత పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది. పెళ్లి చేసుకున్న విషయం తర్వాత తెలియజేసింది. గత ఏడాది పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. పెళ్ళయాక కూడా కెరీర్ కొనసాగిస్తోంది. సూపర్ ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తున్న ప్రణీతకు పెళ్లయ్యిందంటే నమ్మడం కష్టమే. అంత యవ్వనంగా ఆమె కనిపిస్తున్నారు. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్లో మనసులు దోచేసింది. ఆమె ఫోటోలు చూసిన జనాలు అన్నం తింటుందా అమృతం తగ్గుతుందా అంటున్నారు…
View this post on Instagram