Prakash Raj : సినిమా ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్ లో ఉన్నవారైనా సరే వాళ్ళ కెరియర్ లో ఒక్కసారైనా డైరెక్షన్ చేయాలి అనుకుంటారు ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ కాబట్టి అతను ఏం చెప్తే అది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఒక సినిమా అయిన చేసి తమ ప్రతిభను ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటారు. కానీ కొందరికి ఆ అవకాశం వస్తే, మరి కొందరికి ఆ అవకాశం రాకపోవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు దర్శకత్వం చేసిన వారే కావడం విశేషం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడంతో నటుడి గానే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన తన సత్తా చాటుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ధోని(Dhoni) అనే సినిమాతో దర్శకుడిగా మారిన ప్రకాష్ రాజ్ (Prakash raj) ఆ సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నాడు. అలాగే ఉలవచారు బిరియాని సినిమాతో మరోసారి దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రకాష్ రాజ్ తన నటనను బయటకు తీస్తూ తన సత్తా ఏంటో చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా మరోసారి యంగ్ హీరోతో ఒక సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం అయితే అందుకున్నట్టుగా తెలుస్తోంది…
పూరి జగన్నాధ్ (Puri Jagannadh) కొడుకుని హీరోగా పెట్టి ప్రకాష్ రాజ్ మరో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అతన్ని హీరోగా పెట్టి చేసిన ధోని సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ కాంబినేషన్ లో మరోసారి మరో సినిమా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు తన కొడుకును హీరోగా పెట్టి సినిమా చేయలేని పరిస్థితుల్లో సైతం ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్ పనుల్లో ప్రకాష్ రాజ్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే ప్రకాష్ రాజ్ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు లేకపోతే మాత్రం ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడుతుంది…
ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ప్రకాష్ రాజు లాంటి నటుడు అటు సినిమాల్లో నటిస్తూనే, ఇటు దర్శకత్వ ప్రతిభను కూడా నిరూపించుకోవాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటాయి. కాబట్టి దర్శకత్వంతో కూడా తన స్టామినా ఏంటో చూపించుకుంటే మాత్రం ఆయనకు తిరిగి ఉండదనే చెప్పాలి. ఇక స్టార్ హీరోలను సైతం డైరెక్ట్ చేసే అవకాశం కూడా రావచ్చు…