Manchu Lakshmi: మంచు లక్ష్మి ముంబైలో ఉంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. నటిగా, నిర్మాతగా అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మంచు లక్ష్మి టెలివిజన్ హోస్ట్ కూడాను. తెలుగులో పలు టాక్ షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. తాజాగా బాలీవుడ్ లో బ్యూటీ విత్ లక్ష్మి పేరుతో ఒక షో చేస్తున్నారు. ఈ షోకి నటుడు సంజయ్ కపూర్ భార్య మహిషా కపూర్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఫిట్నెస్, బ్యూటీ, లైఫ్ స్టైల్ కి సంబంధించి వారి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి.
శ్రీదేవి ప్రస్తావన కూడా వచ్చింది. మంచు లక్ష్మి గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంది. ఒకసారి జిమ్ లో శ్రీదేవిని చూశాను. ఆమెను చూశాక నేను లోపలి వెళ్ళడానికి సంకోచించాను. శ్రీదేవి ట్రెడ్ మిల్ పై పరుగెడుతోంది. ఆమె జుట్టుకు ఒత్తుగా నూనె రాసుకుని ఉన్నారు. దక్షిణ భారతదేశంలో మహిళలకు తలకు నూనె రాసుకోవడం అలవాటుగా ఉంది. నేను మాత్రం ససేమిరా తలకు నూనె రాసుకోవడానికి ఇష్టపడేదాని కాదు. శ్రీదేవిని చూశాక నా మనసు మారిపోయింది.. అన్నారు.
అంత పెద్ద నటి తలకు నూనె రాసుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. శ్రీదేవి సహజంగా ఉండేందుకు ఇష్టపడేవారు.. అని మంచు లక్ష్మి అన్నారు. మహిషా కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవికి ఏం తినాలి? ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసు.. అంటూ ఆమెతో తన అనుభవాలు వెల్లడించారు. మరోవైపు మంచు లక్ష్మి ముంబైకే పరిమితం అవుతారనే సందేహం కలుగుతుంది. మంచు లక్ష్మి కుటుంబంలో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. మనోజ్-మోహన్ బాబు నువ్వా నేనా అన్నట్లు పబ్లిక్ గా దూషణలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
అగ్ని నక్షత్రం పేరుతో ఒక మూవీ చేసిన మంచు లక్ష్మి… దాన్ని మధ్యలోనే ఆపేసింది. అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు నోచుకోలేదు. ఇటీవల కొన్ని చిత్రాల్లో కీలక రోల్స్ లో ఆమె కనిపించారు. మంచు లక్ష్మి భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఆయన ఐటీ ప్రొఫెషనల్. విదేశాల్లో ఉంటారు. మంచు లక్ష్మికి ఒక కూతురు. సరోగసీ పద్ధతిలో పాపకు జన్మనిచ్చిన మంచు లక్ష్మి.. మళ్ళీ పిల్లల్ని కనలేదు. మంచు లక్ష్మి యోగా, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కూడాను.