Prakash Raj: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎన్నడూ లేని వివాదాలకు దారితీశాయి. సెలెబ్రిటీల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీపడ్డారు. ప్రకాష్ రాజ్ పై గెలిచి మంచు విష్ణు అధ్యక్ష పదవి చేపట్టారు. అయితే ప్రకాష్ ప్యానెల్ తరపున గెలిచిన శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీలతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజీనామా చేశారు. అదే సమయంలో ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, దొడ్డిదారిలో గెలిచారంటూ మోహన్ బాబు, నరేష్, మంచు విష్ణులపై కామెంట్స్ చేయడం జరిగింది.
ఎన్నికల తర్వాత కూడా గొడవలు ఆగలేదు. పోలింగ్ బూత్ సీసీ టీవీ ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశాడు.కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఎన్నికల అధికారి, సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. ‘మా’ సభ్యత్వం లేని, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు పోలింగ్ బూత్ కి వచ్చారు, ఇదే ఆధారం అంటూ ప్రకాష్ రాజ్ మరో వివాదం తెరపైకి తెచ్చాడు. అలాగే తన మా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు… మంచు విష్ణు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తెస్తానని, ప్రశ్నిస్తాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే కొన్నాళ్లుగా ప్రకాష్ రాజ్ మరలా.. మా ఎన్నికలు, అసోసియేషన్ పనితీరుపై కామెంట్స్ చేయలేదు. సడన్ గా ఆయన సైలెంట్ అయ్యారు. దీనితో ప్రకాష్ రాజ్ ‘మా’ ఈ వివాదాన్ని వదిలేసినట్లే అంటూ ప్రచారం సాగుతోంది. మెగా ఫ్యామిలీ కూడా ఎన్నికల ఫలితాల అనంతరం సైలెంట్ కాగా, ప్రకాష్ రాజ్ కూడా అనవసర రాద్ధాంతం చేయకుండా, సమయం వచ్చినప్పుడు ప్రశ్నిద్దాం అని డిసైడై ఉండవచ్చు.
Also Read: Actor Surya: మెగాస్టార్ కు పోటీగా వస్తున్న సూర్య…
కాగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ మౌన వ్రతం చేస్తున్నారు. ఆయన వోకల్ కార్డ్స్ దెబ్బతినడంతో, కొద్దిరోజులు అసలు మాట్లాడకపోతే మంచిదని డాక్టర్స్ సూచించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ, ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ‘మా’ పై ఆయన పోరాట విరామానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.
Also Read: అరంగేట్రం అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ దెబ్బేసింది..!