https://oktelugu.com/

Akhanda Movie: అఖండ సినిమాలో ” నటించిన ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా ?

Akhanda Movie: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ,  డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అఖండ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. కాగా ఇటీవల రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ‘అఖండ ట్రైలర్ రోర్’ పేరుతో వదిలిన ట్రైలర్ అయితే యూట్యూబ్ లో  సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 06:25 PM IST
    Follow us on

    Akhanda Movie: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ,  డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అఖండ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. కాగా ఇటీవల రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ‘అఖండ ట్రైలర్ రోర్’ పేరుతో వదిలిన ట్రైలర్ అయితే యూట్యూబ్ లో  సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ తో అలరించనున్నాడు.

    అయితే ట్రైలర్‌లో టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించారంటూ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అసలు ‘అఖండ’ లో అచ్చు త్రివిక్రమ్‌లా ఉన్న ఆ నటుడి గురించి ఆరా తీస్తే సర్‌ప్రైజింగ్ విషయాలు తెలిసాయి. ఆయన పేరు నితిన్ మెహ్తా. ఇంతకుముందు 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో పని చేశారాయన. మెహ్తాకు ముందు నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అట. మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు కొన్ని సినిమాల్లో నటించారు నితిన్. కానీ నటుడిగా మాత్రం ఆయనకు సాలిడ్ బ్రేక్ రాలేదు. కట్ చేస్తే ‘అఖండ’ తో ఆయన టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ నటుడిగా బిజీ అవవబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లో ‘నేను ఆత్మ.. వాడు నా శరీరం’ అంటూ బాలయ్య అఘోరా క్యారెక్టర్ గురించి చెప్పడంతో పాటు యాక్షన్ సీన్‌లో రౌద్రంగానూ కనిపించి ఆకట్టుకున్నారు నితిన్ మెహ్తా. కాగా అఖండ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 2వ తేదీన అఖండ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.