MAA Elections: టాలీవుడ్ లో కాకరేపుతున్న ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు ఊహించని మలుపు తిరిగాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీకి దిగిన జీవిత, హేమలు విత్ డ్రా చేసుకున్నారు. వారిద్దరూ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిపోయారు. దీంతో ఎన్నికలు సంచలన మలుపు తిరిగాయి. ఇప్పుడు పోటీ మంచు విష్ణుకు, ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మధ్యనే ఉండడం విశేషంగా మారింది.
తాజాగా ప్రకాష్ రాజ్ స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇండస్ట్రీకి సేవ చేయాలనే వచ్చానని.. సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉందని.. మాకు అవకాశం వస్తే అది చేసి చూపిస్తామని’ ప్రకాష్ రాజ్ తెలిపారు.
‘మా’ ప్యానెల్ ను ఇప్పుడు ప్రకటిస్తున్నానని.. ఇందులో మహిళలకు సమాన అవకాశం ఇస్తున్నామని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలోనే స్వయంగా ప్రకాష్ రాజ్ జీవిత, హేమలతో మాట్లాడారు. మనమందరం కలిసి పనిచేద్దామని కోరారు. తన కార్యాచరణను వారికి వివరించాను.. దీంతో ప్రెసిడెంట్ గా వైదొలిగి వారిద్దరూ నా ప్యానెల్ లో పోటీచేయడానికి ఒప్పుకున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు.
ఇక పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని సాయికుమార్, బండ్ల గణేష్ తప్పుకొని జీవిత, హేమలకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే వారిని అధికార ప్రతినిధులుగా ప్రకాష్ నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయికుమార్, బండ్ల గణేష్, సన, శ్రీరామ్ వీరంతా మాకు తోడుగా ఉంటారని ప్రకాష్ రాజ్ వివరించారు.
*ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు వీరే..
-అధ్యక్షుడు-ప్రకాష్ రాజ్
-జనరల్ సెక్రటరీ-జీవిత
-ఉపాధ్యక్షుడు -బెనర్జీ
-ఉపాధ్యక్షురాలు-హేమ
-ట్రెజరర్-నాగినీడు
-జాయింట్ సెక్రటరీ-అనితా చౌదరి
-జాయింట్ సెక్రటరీ-ఉత్తేజ్
-ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్-శ్రీకాంత్
*ఎగ్జిక్యూటివ్ సభ్యులు వీరే
అనసూయ, అజయ్ , వి. భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూం, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, డి. సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీష్, టార్జాన్.