Prabhu Deva: ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ , దర్శకుడు ప్రభుదేవా తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రభుదేవా ఆయన సతీమణి హిమానీ, తమ పాప తో కలిసి సాధారణ భక్తులతో కలిసి క్యూ లైన్ లో నిలబడి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇక ప్రభుదేవా పెళ్లిళ్ల విషయానికి వస్తే 1995 లో రమాలతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. అందులో ఒక అబ్బాయి తన 13 వ ఏటా క్యాన్సర్ వ్యాధి సోకటం తో 2008 లో చనిపోయాడు. ఇక ఆ తర్వాత ప్రభుదేవా ప్రముఖ హీరోయిన్ నయనతార తో సన్నిహితంగా మెలగటం తో భార్య భర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో రమాలత్ 2010 కోర్టులో పిటిషన్ వేయటంతో 2011 లో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత నయనతార తో కూడా చిన్న చిన్న విభేదాలు రావడంతో తమ ప్రేమ బ్రేకప్ చెప్పిన ప్రభుదేవా 2020 లో ఫిజియోదేరఫిస్ట్ హిమానీ సింగ్ ను పెళ్లిచేసుకున్నాడు. గత నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై ప్రభుదేవా సైతం స్పందిస్తూ 50 ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రిని అయ్యాను. ఇప్పుడే నా జీవితం పరిపూరణమైనట్లు అనిపిస్తుందని, కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీ తో గడపాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇప్పటి దాకా తమ బిడ్డ ఫోటో ఎక్కడ చూపించలేదు ప్రభుదేవా దంపతులు. తాజాగా తిరుమల లో కనిపించటం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. హిందీ లో మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా అటు డైరెక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా మరోవైపు నటుడిగా తన సత్తా చాటుతున్నాడు.