Homeట్రెండింగ్ న్యూస్Kalahari Desert Plane Crash: కలహరి ఎడారి లో కూలిన ఒక విమానం.. అడ్వెంచర్ సినిమాకు...

Kalahari Desert Plane Crash: కలహరి ఎడారి లో కూలిన ఒక విమానం.. అడ్వెంచర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని కథ

Kalahari Desert Plane Crash: భూమ్మీద నూకలు ఉంటే ఏం జరిగినా ఏం కాదు అంటారు పెద్దలు. వీరి విషయంలోనూ అదే జరిగింది. ఊపిరి ఆగిపోతుందేమోన్న భయం, గాయాలకు పట్టిన పురుగులు, చుట్టూ క్రూర జంతువులు, కాన మొత్తం గాలించినా కానరాని నీళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అడ్వెంచర్‌ సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి. ఈ స్టోరీనికి కనుక కొంచెం లిబర్టీ తీసుకుని తీస్తే కచ్చితంగా సీట్‌ ఎడ్జ్‌ సినిమా అవుతుంది

అడవిని చూడ్డానికి వెళ్తే..

అనగనగా ఆఫ్రికా ఖండం. బోట్స్‌వానా దేశం.. ఆ దేశ రాజధాని గగోరోన్‌.. అక్కడ ఓ కొరియా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. దాని హెడ్‌ పేరు మైక్‌ నికోలిక్‌.. ఇతడికి సాహస ప్రయాణాలంటే ఇష్టం. పైగా ఆఫ్రికా ఖండంలో ఉంటున్నాడు కాబట్టి విమానంలో విహరిస్తూ అడవిని, అందులో జంతువులను చూడాలి అనుకున్నాడు. ఆఫ్రికా ఖండంలో అడవులు ఎలా ఎక్కువగా ఉంటాయో.. ఎడారులు కూడా అలానే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక ఎడారులు ఆఫ్రికాలో ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారైన సహారా ఆఫ్రికాలోనే ఉంది. అయితే ఈ సహారా తో పోలిస్తే కలహారి ఎడారి పూర్తి విభిన్నం. ఇక్కడ వాతావరణం విచిత్రంగా ఉంటుంది. ఈ ఎడారికి దగ్గరలోనే అడవి ఉంటుంది. ఆ అడవిలో తేమ-శుష్క కలబోత గల వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో 300 జాతులకు చెందిన జంతువులు జీవిస్తుంటాయి. ఇక వీటిని చూసేందుకు మైక్‌ నికోలిక్‌, అతడి భార్య లెనిట్‌, నెఫ్‌ క్రోడిక్‌, విమాన పైలెట్‌.. వీరంతా కలిసి
కోస్టా సిస్నా 414 రకానికి చెందిన విమానంలో బయలు దేరారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. అందమైన అడవిని, అందులోని జంతువులను చూడబోతున్నామని.. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు.

విమానం క్రాస్ ల్యాండ్ అయింది

కోస్టా సిస్నా 414 విమానం నుంచి ఇంధనం లీక్ కావడం మొదలైంది. మొదట్లో ఈ విషయాన్ని నికోలిక్ భార్య లెనిట్ చూసింది.. అది తన భర్తకు చెప్పింది. దీంతో అతడు ఈ విషయాన్ని పైలెట్ కు చెప్పడంతో.. అతడు పెద్దగా ఆందోళన చెందలేదు. ఎందుకంటే ఆ విమానానికి రెండవ ఇంజన్ కూడా ఉంటుంది కాబట్టి. రెండవ ఇంజన్ సహాయంతో ఎలాగైనా అడవిని మొత్తం చుట్టేయచ్చు అనేది అతడి ప్లాన్. ఎడారి ప్రాంతం కావడంతో విపరీతంగా ఎండ.. పైగా పొడి వాతావరణం.. ఫలితంగా అభిమానానికి లాంగిట్యూడ్ సమస్య ఏర్పడింది. అయితే ఇదే విషయాన్ని రెస్క్యూ టీంకు చెబుదామని అతడు ప్రయత్నించాడు.. తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్టు.. సిగ్నలింగ్ సమస్య ఏర్పడడంతో ఫ్లైట్ ను అనువైన వాతావరణం ఉన్నచోట ల్యాండ్ చేద్దామనుకున్నాడు. కానీ ఎక్కడ కూడా అనువైన వాతావరణం కనిపించకపోవడంతో క్రాస్ ల్యాండ్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ అప్పటికే విమానం కిందికి దిగడం ప్రారంభమైంది ఆ అడవిలో దుర్భరమైన వాతావరణం మధ్యలో క్రాస్ ల్యాండ్ అయింది. విమానం నుంచి ఇంధనం లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ దట్టమైన పొగల తాకిడికి మైక్ నికోలిక్ లెనిట్, నెఫ్ క్రోడిక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. లెనిట్ చెయ్యి కాలింది.. క్రోడిక్ ఊపిరితిత్తులు విఫలమయ్యాయి. అతడు శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. మిగతావారు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఆ అడవిలో వారు మూడు రోజులపాటు నరకం చూశారు. కనీసం తాగేందుకు నీరు కూడా దొరకలేదు.

నరకం చూశారు

అసలే ఎడారి ప్రాంతం.. ఆకుల మీద రాత్రిపూట కురిసే మంచు బిందువులతో వారు తమ గొంతు తడుపుతున్నారు. తాగునీటి కోసం అన్వేషిస్తూ ఒక చెట్టు మొదట్లో ఉన్న నీటి నిల్వను చేతులతో తడుపుకుంటూ దాహాన్ని తీర్చుకున్నారు. ఈలోపు రెండు మూడు విమానాలు ఆ ప్రాంతం మీదుగా వెళ్లినప్పటికీ వారికి ఎటువంటి సహాయం చేయలేదు. తినేందుకు ఆహారం లేకపోవడంతో వారు మరింత నీరసపడిపోయారు.. లెనిట్ చేతికి తీవ్రంగా గాయం కావడంతో పురుగులు పడ్డాయి. నికోలిక్, నెఫ్ క్రోడిక్ అడవంతా గాలిస్తుండగా వారికి ఒక ఇల్లు కనిపించింది. ఇందులో ఒక మహిళ ఉండగా.. ఆమె వద్దకు వీరు వెళ్లారు. వీరి పరిస్థితిని చూసిన ఆమె తాగేందుకు నీరు ఇచ్చింది.. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక రెస్క్యూ విమానం ఆ అడవిలో దిగింది..తీవ్ర అస్వస్థతలో ఉన్న వీరిని అందులోకి ఎక్కించుకొని తీసుకెళ్లింది.. కొద్దిరోజులు అయిన తర్వాత వారు కోరుకున్నారు.. సిస్నా విమానం నడిపిన పైలట్ రెండు సంవత్సరాల తర్వాత ఒక విమాన ప్రమాదంలో కన్నుమూశాడు.

ఇంతకంటే గొప్ప జీవిత పాఠం ఏముంటుంది?

కానీ ఆ విమానం క్రాస్ లాండ్ అయిన తర్వాత వారంతా నరకం చూశారు. తాగడానికి నీరు లేక, తినడానికి తినలేక అడవి మొత్తం గాలించారు. భూమ్మీద బతకడానికి నానా తిప్పలు పడ్డారు. ఆహారం కోసం మైళ్ళకొద్ది నడిచారు.. చాలామంది చిన్న చిన్న విషయాలకే తొందరపడి పోతుంటారు. ఆ కారణంగా వారి ప్రాణాలు తీసుకుంటారు. అలాంటి వారికి వీరు అడవిలో ఎదుర్కొన్న సవాళ్లు ఒక బతుకు పాఠం లాంటివి. అందుకే అంటారు పెద్దలు భూమి మీద నూకలు ఉంటే ఇలాంటి కష్టమైనా ఎదుర్కోవచ్చని..

 

https://www.youtube.com/watch?v=aa_7ksyvVc4

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular