Raja Saab OTT release date: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘రాజా సాబ్'(The Rajasaab Movie). ఈ సినిమాకు వచ్చిన నష్టాలే దాదాపుగా వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి కూడా బడ్జెట్ రికవర్ అవ్వలేదు. ఇక థియేట్రికల్ బిజినెస్ అయితే అన్ని ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బేసిస్ మీదనే ఈ చిత్రాన్ని అమ్మాల్సి వచ్చింది. ఒక్క ప్రాంతంలో ఈ చిత్రం కనీసం 50 శాతం రీకవరీ రేట్ ని కూడా అందుకోలేకపోయింది. ఇప్పుడు నిర్మాతే తిరిగి బయ్యర్స్ కి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని జియో హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసింది.
నిర్మాతలు డిమాండ్ చేసిన డబ్బులతో సగం రేట్ కి కూడా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోలేదని టాక్. అయితే ఇప్పుడు ‘రాజా సాబ్’ థియేట్రికల్ రన్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో క్లోజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి పట్టుమని 100 షోస్ కూడా లేవు. జియో హాట్ స్టార్ సంస్థ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6 న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం 4 గంటలకు చేయనున్నారు. అయితే ఇక్కడే ఒక ట్వీస్ట్ ఉంది. ఈ చిత్రం హిందీ లో తప్ప, మిగిలిన అన్ని భాషల్లోనూ ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నారు. హిందీ వెర్షన్ మాత్రం 7 వారాలు పూర్తి అయ్యాకనే విడుదల చేస్తారు. ఎందుకంటే హిందీ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ నేషనల్ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో ఉండాలంటే కచ్చితంగా ఓటీటీ డీల్ వారాలు తర్వాతే ఉండాలి.
అందుకే జియో హాట్ స్టార్ లో ఈ చిత్రం హిందీ వెర్షన్ ని ఫిబ్రవరి 6న విడుదలైన మూడు వారాల తర్వాతనే విడుదల చేయబోతున్నారు. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాన్ని తీసుకుందాం . ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది, కానీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 స్థానం లో నిల్చుంది. ‘రాజా సాబ్’ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ఓటీటీ లో వస్తుందో లేదో చూడాలి. చాలా మంది అభిప్రాయం ఏమిటంటే ‘రాజా సాబ్’ అంత పెద్ద డిజాస్టర్ అవ్వాల్సిన సినిమా కాదు అని. మరి ఆ అభిప్రాయాల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఫిబ్రవరి 6 వరకు ఆగాల్సిందే.